Official Statement from 24 Frames Factory Regarding Youtube Strikes Issue: మంచు విష్ణు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని పూర్తిగా తొలగిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే నటీనటుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బందికరమైన కంటెంట్తో ట్రోల్ చేస్తే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ ని నిర్మూలించే ప్రయత్నం చేస్తామని హెచ్చరించింది అయితే తాజాగా 24 ఎఫ్ ఎఫ్ అఫీషియల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు మంచు విష్ణు కన్నప్ప కంటెంట్ గురించి పాజిటివ్ కంటెంట్ వేస్తే యూట్యూబ్ ఛానల్ మీద వేసిన స్ట్రైక్ తీసేస్తామని తమతో బేరానికి దిగినట్లుగా ఆరోపణలు చేశాడు ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు అయితే ఇదే విషయం మీద మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారికంగా స్పందించింది. మా ప్రొడక్షన్ కంపెనీకి అస్సలు సంబంధం లేని తప్పుడు ఇమెయిల్ వినియోగదారు పేరుతో ‘TwentyFour FFOfficial’ అనే అంశం వినియోగించబడిన సంఘటన గురించి మాకు తెలిసింది.
Sai Dharam Tej: పావల శ్యామల కన్నీరు.. సాయి తేజ్ ఎమోషనల్
మా అధికారిక ఇమెయిల్ చిరునామా info@24FramesFactory.com. మా కంపెనీ నుండి ఈ అధికారిక ఇమెయిల్ చిరునామా నుండి కాకుండా వచ్చే అన్ని కమ్యూనికేషన్లను తప్పుడవి అని అవి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుండి రావడం లేదని భావించాలని పేర్కొంది. మా పరస్పర చర్యల సమగ్రతను నిలుపుకోవడానికి మేము చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఇక 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, కన్నప్ప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ .. “మా కంపెనీ నుండి వచ్చినట్లు ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారం, ఇమెయిళ్ళను మేము గమనించాము. info@24FramesFactory.com నుండి పంపబడని ఇమెయిళ్లను తప్పుడువిగా భావించి స్కిప్ చేయండి. ఈ తప్పుడు ఇమెయిళ్ల మూలాన్ని గుర్తించడం కోసం మేము దర్యాప్తు చేస్తున్నాము, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాము అని పేర్కొన్నారు. మా హీరో విష్ణు మంచు నటుల గౌరవం కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా పోరాటం చేస్తున్నందున, కొంతమంది తప్పుడు వ్యక్తులు ఈ తప్పుడు ప్రచారాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆయన యత్నాలను అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగా స్పష్టమవుతుంది, ఇలాంటి తప్పుడు విషయాలు నమ్మవద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. నిజమైన సినిమా ప్రేమికులు ఎల్లప్పుడూ సినిమాను ప్రేమిస్తారు, ఈ విషయం పరిష్కరించుకునేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలకు మీ మద్దతు కోరుకుంటున్నాము అని అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.