Salary Hike: ఆ ఉద్యోగులకు శుభవార్త.. 10 శాతంపైగా జీతాలు పెంచిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salary Hike: అమరావతి కేంద్రంగా పనిచేస్తున్న లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల జీతాలను పెంచుతూ మంత్రి సవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. లేపాక్షి షోరూమ్‌లలో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో ఉద్యోగులకు ప్రత్యేక బోనాంజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం అందిస్తున్న మూల వేతనంపై 10 శాతం కంటే ఎక్కువ పెంపు వర్తింపజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లేపాక్షి షోరూమ్‌ల అమ్మకాలు రూ.60.75 కోట్లకు పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
అమ్మకాలు పెంచడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను మంత్రి సవిత అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లేపాక్షి షోరూమ్‌ల అమ్మకాలను రూ.80 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హస్తకళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కళాకారులకు మార్కెట్ అవకాశాలు పెంచడంతో పాటు ఉద్యోగుల సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు మంత్రి సవిత.. ఇక, జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్ మరియు మంత్రి సవితకు లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- YS Jagan: దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు..! డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై జగన్ సంచలన ఆరోపణలు
- YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
- YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
- CM Chandrababu Warns Collectors: కలెక్టర్లకు సీఎం వార్నింగ్.. డీఎస్సీపై ఇద్దరు మహిళా ఐఏఎస్‌లకు ప్రశంసలు..
తాజావార్తలు
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
-
Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?