AP Government: కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంతో రేషన్‌కార్డు ఉన్నవారికే లబ్ధిచేకూరనుంది.. ఎందుకంటే.. రాష్ట్ర ప్రజలకు పౌరసరఫరాల శాఖ.. కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది. నెల వ్యవధిలోనే రెండు సార్లు కందిపప్పు ధరలను తగ్గించారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కందికప్పు ధర క్వాలిటీని బట్టి.. రూ.150.. రూ.160.. రూ.170 ఇలా పలుకుతుండగా.. దాయితపై కిలో కందిపప్పును రూ.67కే అందించనుంది ప్రభుత్వం.. మరోవైపు.. కిలో షుగర్ ధర.. బహిరంగ మార్కెట్‌లో రూ.50కి పైగా పలుకుతుండగా.. రూ.17 అరకిలో చక్కెర పంపిణీకి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టనుంది.. నిత్యావసరాల ధరలను కంట్రోల్ చేసేలా చర్యలకు ఉపక్రమించింది ఏపీ ప్రభుత్వం.. తక్కువ ధరలకు రేషన్ షాపుల్లో కందిపప్పు.. షుగర్ విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు..
Read Also: The Goat OTT: విజయ్ అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి ‘ది గోట్’! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో.. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ నెల నుంచే కందిపప్పు, షుగర్‌ను పంపణీ చేస్తోంది. ఇక, గోధుమపిండితో పాటుగా రాగులు, జొన్నల్ని కూడా రేషన్‌తో పాటూ అందించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. ఇక, తెనాలిలో ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా చక్కెర, కందిపప్పు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఒక 1.49 కోట్ల రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకు కందిపప్పు, చక్కెర అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. తక్కువ ధరలకు కందిపప్పు, చక్కెర అందించడం వల్ల 4.32 కోట్ల మంది లబ్ది పొందుతారని తెలిపారు.. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 29,811 రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు, అరకేజీ చక్కెర తగ్గించిన ధరకే పంపిణీ చేస్తామని వెల్లడించారు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.