AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS)పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. EHS కింద ఉద్యోగులు, పెన్షనర్లు చెల్లించాల్సిన చందాలను నేరుగా NTR వైద్య సేవా ట్రస్ట్‌కు జమ చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రతి నెలా ఒకటో తేదీన EHS నిధులను జమ చేయనున్నారు. ఉద్యోగి లేదా పెన్షనర్ చెల్లించాల్సిన 50 శాతం వాటాతో పాటు ప్రభుత్వం భరించే 50 శాతం వాటాను కూడా ఒకేసారి జమ చేయాలని నిర్ణయించారు. అంటే EHSలో ఉద్యోగి/పెన్షనర్ వాటా 50 శాతం కాగా, ప్రభుత్వ వాటా కూడా 50 శాతంగా ఉంటుంది. జీతాలు, పెన్షన్ల చెల్లింపుతో సమకాలంలోనే EHS నిధులను జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్‌కు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో EHS నిధుల జమ ప్రక్రియ మరింత క్రమబద్ధంగా కొనసాగనుంది.
మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (EHS) కింద ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి వసూలు చేసే నెలవారీ చందాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను కూడా నిర్ణీత సమయంలో నేరుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు బ్యాంకు ఖాతాకు జమ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ సోమవారం జీవో నంబర్ 131 జారీ చేశారు. ఈ కొత్త విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇకపై ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు చెల్లించే సమయంలోనే EHSకు సంబంధించిన నెలవారీ చందాలను కూడా ట్రస్టు ఖాతాకు బదిలీ చేయనున్నారు. ఇక గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం EHSలో ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వం మధ్య నిధుల వాటా నిష్పత్తి 50:50గా ఉంది. తాజా నిర్ణయంతో ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సేవలకు అవసరమైన నిధులు నిర్దిష్ట సమయంలో ట్రస్టుకు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పించే చర్యగా పేర్కొంటున్నాయి.
Also Read
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
తాజావార్తలు
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!