AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP DSC Recruitment: డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలు, సందేహాలపై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మరోసారి వివరణ ఇచ్చారు. డీఎస్సీ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి తప్పిదాలు జరగలేదని స్పష్టం చేసిన ఆయన, అభ్యర్థుల్లో నెలకొన్న కొన్ని అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్‌లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాదిలోనే మరో డీఎస్సీ నిర్వహించనున్నట్లు కోన శశిధర్ వెల్లడించారు. ప్రస్తుత నియామకాల్లో అవకాశం దక్కని అభ్యర్థులకు మరో అవకాశం లభిస్తుందని తెలిపారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైన ప్రతి అభ్యర్థికి ఉద్యోగం వస్తుందని హామీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కాల్ లెటర్లలో కూడా స్పష్టంగా పేర్కొన్నామని చెప్పారు. రూల్స్ ప్రకారం నవీన్ అనే అభ్యర్థి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని వివరించారు కోన శశిధర్. హారిజాంటల్ రిజర్వేషన్ల విషయంలో కొంతమంది అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారని, ఈ ప్రక్రియ డైనమిక్‌గా ఉంటుందని కోన శశిధర్ పేర్కొన్నారు. దీనిపై పూర్తి అవగాహన కోసం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది అభ్యర్థులు నేరుగా వచ్చి వివరాలు తెలుసుకుని వెళ్లారని తెలిపారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
డీఎస్సీ ఫలితాల విషయంలో ఎక్కడా రిజెక్షన్ లిస్ట్ విడుదల చేయలేదని, కేవలం సెలక్షన్ లిస్ట్ మాత్రమే ప్రకటించామని స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి లాగిన్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినప్పుడు ఇంకా అనుమానాలకు తావు లేదన్నారు. సెలెక్ట్ కాలేకపోయిన అభ్యర్థుల్లో నిరాశ ఉండటం సహజమని, వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటున్నామని కోన శశిధర్ అన్నారు. అయితే ఎంపికైన అభ్యర్థులందరూ పూర్తిగా తమ ప్రతిభ, మెరిట్ ఆధారంగానే ఎంపికయ్యారని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరిన సీబీఐ విచారణ అంశంపై స్పందించిన కోన శశిధర్, అధికారులుగా తమ బాధ్యత వాస్తవాలను ప్రజలకు తెలియజేయడమేనని చెప్పారు. డీఎస్సీ నియామకాల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని మరోసారి స్పష్టం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ల కారణంగా కొంతమంది అభ్యర్థుల్లో అసంతృప్తి ఉండొచ్చని, అయితే నియామకాల ప్రక్రియ పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందని తెలిపారు.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!