Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: మహానాడుపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు.. ఈ పదం విన్నా, చదివినా..!

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: కడప మొత్తం పసుపు మయం అయ్యింది.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు అంగరంగవైభవంగా సాగుతోంది.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతోన్న ఈ మహానాడుకు ప్రాధాన్యత ఏర్పడింది.. అయితే, కూటమిలో కీలకంగా ఉన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. మహానాడు ప్రారంభమైన సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలుగుదేశం పార్టీపై ప్రశంసలు కురిపించారు..

Read Also: KCR: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. విచారణకు వెళ్లేది ఆ రోజే..?

మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు పెట్టారు పవన్‌ కల్యాణ్.. “మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై.. కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వములో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులుకు శుభాభినందనలు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువ గళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను”.. అంటూ పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version