NTV Telugu Site icon

CM Chandrababu Gujarat Tour: నేడు గుజరాత్‌కు సీఎం చంద్రబాబు.. ప్రధానితో భేటీ..!

Babu

Babu

CM Chandrababu Gujarat Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుజరాత్‌ వెళ్లనున్నారు.. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో పర్యటించనున్నారు చంద్రబాబు.. గాంధీనగర్ లో నేటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం.. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎనర్జీ రంగంలో పేరున్న పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులతో చర్చల్లో పాల్గొననున్నారు.. గుజరాత్‌ పర్యటన కోసం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు చంద్రబాబు.. గాంధీనగర్ ఇన్వెస్టర్స్ మీట్ కు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనంతరం రాత్రి 9 గంటలకు అమరావతికి తిరిగి ప్రయాణం కానున్నారు..

Read Also: Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..

కాగా, నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రెన్యూవబుల్‌ ఎనర్జీ(ఆర్‌ఈ) ఇన్వెస్టర్స్‌ మీట్‌-2024 జరగనుంది.. అయితే.. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ఈ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సదస్సు వేదికగా.. జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.. మరోవైపై.. ఆర్‌ఈ ఇన్వె్‌స్ట్‌-2024కు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. దీంతో.. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది.

Show comments