Site icon NTV Telugu

CM Chandrababu: రాజధానిగా అమరావతిని నోటిఫై చేయండి..

Babu

Babu

CM Chandrababu: విభజన చట్టంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టారు.. పదేళ్లయిపోయింది కాబట్టి ఇప్పుడు రాజధానిగా లేదు.. గతంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించారు.. ఇప్పుడు చట్ట సవరణ చేసి అమరావతిని నోటిఫై చేయాలని కోరామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ సహా మరికొందరితో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగింది.. గత ప్రభుత్వం రూ.లక్షా ఇరవై వేల కోట్లు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది.. ఈ ఏడాది రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి అని తెలిపారు.

Read Also: Off The Record: ఆ మాజీ మంత్రి వ్యవహారం వైసీపీలో బూమ్ రాంగ్ అయ్యిందా..?

వైసీపీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుంది.. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించాం.. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఏపీకి ఈ ఏడాది పెట్టుబడులు వచ్చాయి.. ఏడుగురు మంత్రులను కలిశాను.. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం.. 72 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ పవర్‌ ఉత్పత్తి చేస్తాం.. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం.. మేజర్‌గా ఏపీ నుంచి ఉత్పత్తి చేస్తాం అన్నారు.. రూ. 28 వేల 346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని ప్రహ్లాద్ జోషిని కోరామని తెలిపారు చంద్రబాబు.. రాయలసీమలో 11 గిగావాట్ల సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేయాలి.. దీనికి ప్రహ్లాద్ జోషి అంగీకరించారు.. సూర్యఘర్ కింద ప్రతి నియోజకవర్గంలో 10 వేల కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం.. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం అన్నారు..

Read Also: RCB vs SRH: ఇషాన్ కిషన్ వన్ మ్యాన్ షో.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్..!

ఏపీలో నాలుగు డిఫెన్స్‌ ఉత్పత్తి కేంద్రాలకు రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశాను అన్నారు చంద్రబాబు. జగ్గయ్యపేట-దొనకొండ క్లస్టర్‌లో మిస్సైల్‌ ప్రొడక్షన్‌ సెంటర్‌.. లేపాక్షి-మడకశిరలో మిలటరీ అండ్ సివిల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ తయారీ.. విశాఖ-అనకాపల్లి క్లస్టర్‌లో నేవల్‌ ఎక్విప్‌మెంట్‌ ప్రొడక్షన్‌.. కర్నూలు-ఓర్వకల్లులో మిలటరీ డ్రోన్ల తయారీ చేయాలని కోరాను అన్నారు. ఇక, ఏపీలో ఆర్మీ కంటోన్మెంట్‌ లేదు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కంటోన్మెంట్‌లు ఉన్నాయి.. ఏపీలో కంటోన్మెంట్‌ కోరాం.. వర్కవుట్‌ చేస్తామని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారని వెల్లడించారు..

Read Also: Theatres Closure : థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు నిర్మాతల ఒత్తిడి.. రంగంలోకి ఏపీ మంత్రి

2019-24లో ఏపీలో భారీ విధ్వంసం జరిగింది.. పునర్నిర్మాణానికి కనీసం పదేళ్లు పడుతుంది.. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు చంద్రబాబు.. ఏడాది కాలంగా అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం.. ఎన్నడూ చూడనంత విధ్వంసం జరిగింది.. ఏపీని పునర్నిర్మిస్తున్నాం.. ఏమాత్రం వెసులుబాటు లేనంతగా నష్టపోయిందన్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్ర జలశక్తి మంత్రికి రిపోర్ట్‌ చేశా.. ఫాస్ట్‌ట్రాక్‌లోప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతోంది.. 2027కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. వీలైతే 2027 మార్చికే పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాం.. ప్రాజెక్‌ నిర్మాణం, నాణ్యతో రాజీ పడట్లేదన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version