NTV Telugu Site icon

White Paper On Power Sector: విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల..

Cbn

Cbn

White Paper On Power Sector: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా వివిధ రంగాలపై శ్వేతప్రతాలు విడుదల చేస్తూనే ఉంది.. ఈ రోజు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను బయటపెడుతూ.. పీపీఏల్లో అవకతవకలు, సోలార్, విండ్‌, పవర్‌ కొనుగోళ్లల్లో అనితీపై వివరణ ఇచ్చారు.. ఇదే సమయంలో.. హైడ్రో పంప్‌ ఎనర్జీ, స్మార్ట్‌ మీటర్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు.. వ్యవసాయ మీటర్లు, పవర్‌ ప్రాజెక్టుల గోల్‌మాల్‌పై కూడా వివరణ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని విమర్శించిన ఆయన.. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నం అన్నారు.. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యతలేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయన్నారు..

Read Also: Inaya Sultana: బాయ్ ఫ్రెండ్‌తో ఇనయా.. బాత్ టవల్‌లో ఈ రచ్చ ఏంట్రా?

ఇక, విద్యుత్ తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది.. విద్యుత్ రంగంపైనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. 2014లో తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది. ఈ ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు.. అసమర్థులు పాలన చేస్తే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు.. ఒక అసమర్థుడు, అహంకారి రెండూ కలిసిన నేత రాజకీయాలకు అనర్హుడు అని ఫైర్ అయ్యారు.. వాస్తవాలు ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్న ఆయన.. ఏ శాఖ చూసినా తీవ్రమైన పరిస్థితి కనిపిస్తోంది.. తవ్విన కొద్దీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.. 2014-19 మధ్య విద్యుత్ ఉత్పత్తి పెంచి, కరెంటు బిల్లు పెంచకుండా, నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత నాటి టీడీపీ ప్రభుత్వానిది అన్నారు.. కరెంటుపై బాదుడు తెలిస్తే, కరెంటు షాక్ కొట్టాల్సిందే అన్నట్టుగా చార్జీలు పెంచారని దుయ్యబట్టారు..

Read Also: SLBC Meeting: SLBC సమావేశంలో కీలక నిర్ణయం.. రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక..

2019తో పోల్చుకుంటే, 2024కి 98 శాతం కరెంటు బిల్లు పెంచేశారని.. 9 సార్లు కరెంటు బిల్లు పెంచి, పేదవాడిని పీక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, దేశంలోనే మొట్టమొదటి సారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. నేడు అవే సంస్కరణలు దేశానికి ఆదర్శం అయ్యాయి. గెలుపు ఓటమలు కంటే, మనం చేసిన పనులు, దేశానికి ఉపయోగపడ్డాయనే తృప్తి నాకుంది అన్నారు.. ఇక, సీఎం ఛాంబర్ లో కమోడ్లు, ఏసీలు కూడా పని చెయ్యట్లేదు.. ఆ రూమ్ కి ఎవరు వచ్చినట్టు లేరు అంటూ సెటైర్లు వేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. విద్యుత్‌ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా.. ఇక సీఎం చంద్రబాబు ఇంకా ఏమేమి మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌లను క్లిక్‌ చేయండి..