Chandrababu letter to Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేవంత్ కోరినట్టు టీటీడీ దర్శనాల కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులకు ఆమోదం తెలుపుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.. సోమవారం నుంచి గురువారం వరకు రెండు బ్రేక్ దర్శనం కోసం, రెండు ప్రత్యేక దర్శనం కోసం సిఫార్సు లేఖలను అనుమతి ఇస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: Manish Sisodia: ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆర్థిక సాయం చేయండి.. ప్రజలకు సిసోడియా విజ్ఞప్తి
సీఎం చంద్రబాబు లేఖ విషయానికి వస్తే.. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి, మీరు పంపిన లేఖ అందినది.. ఆ లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలించాం.. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలనే మీ ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకున్నాం.. తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో కింద పేర్కొన్న విధంగా అనుమతులు మంజూరు చేయుటకు ఆదేశాలు ఇవ్వడమైనది.. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని మీ కోరికపై కింద పేర్కొన్న విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.. ప్రతీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజులు (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500 టికెట్) కొరకు రెండు సిఫార్సు లేఖలు, స్పెషల్ దర్శనం (రూ.300) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయి.. ప్రతి లేఖలో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయవచ్చునని ఆ లేఖలో పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..