NTV Telugu Site icon

Chandrababu Meets Nitin Gadkari: నితిన్‌ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతికి అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ..!

Chandrababu

Chandrababu

Chandrababu Meets Nitin Gadkari: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. తొలిరోజు బిజీబిజీగా గడిపిన ఆయన.. ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇవాళ మొదటగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి – హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి – రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించారు..

Read Also: Srinivasulu Whatsapp Story: కరీంనగర్ లో వాట్సాప్ గ్రూప్.. ట్రెండింగ్‌ అవుతున్న శ్రీనివాస్ అనే పేరు..

ఇక, తొలిరోజు ఢిల్లీ పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫలప్రదమైన సమావేశం జరిగింది అంటూ ట్విట్టర్‌లో పంచుకున్నారు చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు తెలిపాను.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వివరించాను .. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి అందిస్తున్న చేయూతకు ధన్యవాదాలు తెలిపాను.. అమరావతి రాజధాని నిర్మాణానికి మద్దతు అందిస్తున్నారు అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు..

Read Also: Vinesh Phogat: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌.. వీడియో వైరల్!

మరోవైపు.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో సమావేశంపై కూడా ఎక్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో పోస్టు పెట్టారు.. డిసెంబర్‌లో వైజాగ్ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తామని.. ఏపీలో రైల్వే శాఖ 73,743 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది.. హౌరా- చెన్నై నాలుగు లైన్ల ప్రాజెక్టులో ఇది భాగం.. 73 రైల్వేస్టేషన్లో ఆధునికరిస్తారు.. మరిన్ని స్థానిక రైళ్లను నడుపుతారు.. రైల్వే శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం పని చేయడానికి సిద్ధంగా ఉంది అంటూ ట్వీట్‌ చేసిన విషయం విదితమే.. ఇక, ఈ రోజు సాయంత్రం 4.30కి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అవుతారు.. ఇక, 5:45కి కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీకానున్నారు.. రాత్రి 8 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశంకానున్నారు.. రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు..