NTV Telugu Site icon

CM Chandrababu: రంగం ఏదైనా భారతీయులదే విజయం.. దావోస్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Babu

Babu

CM Chandrababu: వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధించి.. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా భారతీయల్లో ఉందన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… ప్రపంచంలో అందరికీ అత్యంత ఆమోదయోగ్యమైన ఏకైక కమ్యునిటీగా భారతీయులు గుర్తింపు పొందారన్నారు.. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండో రోజున, భారత పరిశ్రమల సమాఖ్య ప్రత్యేక సెషన్‌లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై ముఖ్యమంత్రి ప్రసంగించారు. 100కు పైగా దేశాల్లో తెలుగువారు ఉన్నారని, తక్కువ సమయంలోనే ఇంతలా తెలుగువారు విశ్వవ్యాప్తం అవుతారని ఎవరూ ఊహించలేదన్నారు. రెండో రోజు దావోస్ పర్యటనలో సీఐఐ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.. మానవ వనరుల లభ్యత ఏపీకి ప్లస్ పాయింట్ అని, భారతీయ పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నారని, తమ ప్రతిభతో రాణిస్తున్నారని పేర్కొన్నారు.

Read Also: Hyderabad: మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్.. వీవీఐపీల పేరుతో మోసాలు

భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలోని గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ దోహదపడుతుందన్నారు సీఎం చంద్రబాబు.. నాయకత్వ వికాసాన్ని పెంపొందించడానికి స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్, జీఎల్‌సీ మధ్య అవగాహన కలిగిందన్నారు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, దైనందిన జీవితాన్ని మెరుగుపరచడానికి ఏఐ, రియల్ టైమ్ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని చంద్రబాబు వివరించారు. భారతదేశం అందించిన సేంద్రియ వ్యవసాయం ప్రపంచ సమాజానికి ఒక వరంగా చంద్రబాబు పేర్కొన్నారు. పీ4 మోడల్ ద్వారా ప్రభుత్వ-ప్రైవేటు-పబ్లిక్ భాగస్వామ్యాన్ని ఇటు పాలనలోనూ తీసుకువచ్చామని చెప్పారు. హరిత పారిశ్రామికీకరణ, డీప్-టెక్ ఇన్నోవేషన్, సమ్మిళిత నాయకత్వంపై దృష్టి సారించామని చెప్పారు.రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు గ్లోబల్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.

Read Also: Naga Shaurya : క్యూట్ భాయ్ నాగశౌర్య కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసిందోచ్

ఇక, ఇంధన సంస్కరణలు కూడా సుస్థిర అభివృద్ధికి ఒక ఉదాహరణగా తెలిపారు సీఎం చంద్రబాబు. 1999లో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో సాహసోపేతమైన విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయం సాధించనని గుర్తు చేశారు. నాడు దేశం తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంది, పరిశ్రమలు మూసివేయవలసి వచ్చిందని.. కొన్ని సవాళ్లు-భయాలు ఉన్నప్పటికీ క్లిష్టమైన సంస్కరణలను చేపట్టానని.. ఆనాటి సంస్కరణల వల్ల తన రాజకీయంగా నష్టం కలిగించిందని, అయితే ఆ నిర్ణయాలతో ఇప్పుడు ప్రయోజనాలు పొందుతున్నామనే సంతృప్తి ఉందన్నారు. అలాగే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతిని సాధించామని, ఇంధన ఖర్చులు తగ్గించగలిగామని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..