Phase-2 Land Pooling: రెండో విడత ల్యాండ్ పూలింగ్..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- కేబినెట్ సమావేశంలో ల్యాండ్ పూలింగ్ కు గ్రీన్ సిగ్నల్..
- రెండో విడతలో 20 వేలకు పైగా ఎకరాల భూ సమీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phase-2 Land Pooling: అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెడుతూనే.. రెండో విడత భూ సేకరణపై దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతోన్న కేబినెట్ సమావేశంలో .. అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ విధివిధానాలపై కీలక చర్చలు కొనసాగుతున్నాయి. రాజధాని పరిధిలో మరిన్ని గ్రామాలను సేకరణ ప్రదేశాలుగా గుర్తిస్తూ, భూ సమీకరణ చర్యలకు వేగం పెంచనుంది ప్రభుత్వం. రెండో విడత భూ సమీకరణలో భాగంగా పరిశీలించిన గ్రామాల విషయానికి వస్తే.. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి ఉన్నాయి.. ఈ గ్రామాల్లో భూ లభ్యత, రికార్డులు, యాజమాన్యం, అభ్యంతరాలు వంటి అంశాలపై అధికారులు నివేదికలు సమర్పించారు.
రెండో విడత భూ సమీకరణ వివరాలు:
వైకుంఠపురం – 3,361 ఎకరాలు
పెదమద్దూరు – 1,145 ఎకరాలు
ఎండ్రాయి – 2,166 ఎకరాలు
కర్లపూడి – 2,944 ఎకరాలు
వడ్డమాను – 1,913 ఎకరాలు
హరిశ్చంద్రపురం – 2,418 ఎకరాలు
పెదపరిమి – 6,513 ఎరాలు..
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
ఇలా మొత్తం 20,494 ఎకరాల భూమిని సేకరించనున్నారు.. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 20,494 ఎకరాల సేకరణ చేపట్టనున్నట్లు CRDA స్పష్టం చేసింది. త్వరలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అమరావతి రాజధానిలో మొత్తం భూ సమీకరణ లక్ష్యం మొదటి విడతలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరణ కాగా.. రెండో విడత లక్ష్యం అదనంగా 16,000 ఎకరాలుగా ఉంది.. మొత్తం రైతుల నుంచి భూ సమీకరణ 50,000 ఎకరాలు కాగా.. అదనంగా ప్రభుత్వ భూమి 16,000 ఎకరాలు CRDAకి అప్పగించనున్నారు.. దీంతో అమరావతి రాజధాని నిర్మాణానికి మొత్తం 70,000 ఎకరాల భూభాగం సిద్ధమవుతోంది.
కేబినెట్ సమీక్షించిన మరిన్ని అంశాలు విషయానికి వస్తే.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్.. అమలు విధానాలపై వివరణాత్మక చర్చ జరిగింది.. భూ రికార్డుల డిజిటలైజేషన్, భూ యజమానులకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. మొత్తంగా అమరావతి నిర్మాణ ప్రక్రియను మళ్లీ వేగవంతం చేస్తూ, రెండో విడత ల్యాండ్ పూలింగ్ను ప్రభుత్వం కీలక అడుగుగా చూస్తోంది. త్వరలో అధికారిక నోటిఫికేషన్ వెలువడుతుందని సమాచారం.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?