FIFA World Cup 2026: ‘ఉండావ్’ డబుల్ ధమాకా.. ఐవరీ కోస్ట్‌పై జర్మనీ అద్భుత విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి అడుగు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ జట్టు విజయంతో ప్రీక్వార్టర్ ఫైనల్ (రౌండ్ ఆఫ్ 32)లోకి అడుగుపెట్టింది. టొరంటో స్టేడియంలో నేడు జరిగిన కీలక మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది జర్మనీ. ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన ‘డెనిజ్ ఉండావ్’ రెండు గోల్స్ సాధించి జట్టును గెలిపించి హీరోగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే జర్మనీ దూకుడుగా ఆడింది. తొలి నిమిషంలోనే కై హావెర్ట్జ్ హెడ్డర్‌తో గోల్‌కు చేరువయ్యాడు. ఆ తర్వాత జోషువా కిమ్మిచ్ ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను హావెర్ట్జ్ శక్తివంతమైన హెడ్డర్‌గా మలిచినా, ఐవరీ కోస్ట్ గోల్‌కీపర్ యాహియా ఫోఫానా అద్భుత సేవ్ చేసి జట్టును కాపాడాడు.
మొదటి అర్ధభాగం మధ్యలో అలెగ్జాండర్ పావ్లోవిచ్ కార్నర్ ద్వారా గోల్ సాధించినా.. మోచితిని ఉపయోగించినందుకు రిఫరీ ఆ గోల్‌ను రద్దు చేశాడు. దీంతో జర్మనీ ఆధిక్యం సాధించే అవకాశం చేజారింది. జర్మనీ ఒత్తిడిని తట్టుకుని ఆడిన ఐవరీ కోస్ట్ 30వ నిమిషంలో సంచలన గోల్ నమోదు చేసింది. యాన్ డియోమాండే ఎడమవైపు నుంచి బాక్స్‌లోకి బంతిని పంపగా, అమాద్ డియల్లో చేసిన ప్రయత్నాన్ని నాథనియల్ బ్రౌన్ అడ్డుకున్నాడు. అయితే రీబౌండ్‌గా వచ్చిన బంతిని ఫ్రాంక్ కెస్సీ గోల్‌గా మలిచి ఐవరీ కోస్ట్‌కు 1-0 ఆధిక్యం అందించాడు.
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
రెండో అర్ధభాగంలో జర్మనీకి ఐవరీ కోస్ట్ రక్షణ గోడను ఛేదించడం కష్టంగా మారింది. దీంతో కోచ్ జూలియన్ నాగెల్స్‌మన్ 60వ నిమిషం తర్వాత నాదీమ్ అమిరి, డెనిజ్ ఉండావ్లను మైదానంలోకి దించాడు. ఈ నిర్ణయం జర్మనీకి గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. 68వ నిమిషంలో అమిరి ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను ఉండావ్ చక్కగా హెడ్డర్‌గా మలిచి గోల్ సాధించాడు. దీంతో జర్మనీ 1-1తో సమం చేసి మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంది. ఆ తర్వాత ఐవరీ కోస్ట్ మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. నికోలస్ పెపే కుడి వైపు నుంచి దూసుకెళ్లి సైమన్ అడింగ్రాకు పాస్ ఇచ్చినా.. అతడి తొలి టచ్ తప్పిపోవడంతో జర్మన్ డిఫెన్స్ ప్రమాదాన్ని నివారించింది. ఆ తప్పిదం ఐవరీ కోస్ట్‌కు చివరికి భారీ మూల్యం చెల్లించింది.
ఇంజరీ టైమ్‌లో మ్యాచ్ ముగిసే వేళ లుకాస్ న్మెచా ఇచ్చిన అద్భుతమైన త్రూ బాల్‌ను అందుకున్న ఉండావ్ అసాధారణ సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. బాక్స్‌లో తిరిగి నిలబడి 94వ నిమిషంలో గోల్‌కీపర్ ఫోఫానాను మట్టికరిపిస్తూ బంతిని నెట్లోకి పంపించాడు. ఆ గోల్‌తో జర్మన్ ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయంతో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జర్మనీ రౌండ్ ఆఫ్ 32లోకి అర్హత సాధించగా.. ఐవరీ కోస్ట్‌కు నిరాశ ఎదురైంది.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!