NTV Telugu Site icon

AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఇక, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం..!

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం ముగిసింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది మంత్రివర్గం.. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది.. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 100లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది.. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

Read Also: One Nation-One Election: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంటే ఏంటి?

మరోవైపు.. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. వచ్చే దీపావళి నాటికి మహిళలకు కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగింది.. ఉచిత వంట గ్యాస్ అందిద్దామా..? లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా..? అనే అంశంపై మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పథకం వైపే మెజార్టీ మంత్రుల మొగ్గు చూపారట.. ఇక, బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు.. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారు.. బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫార్సు చేసింది ఏపీ కేబినెట్‌.. దీంతో.. బీసీలకు రిజర్వేషన్ల తీర్మానంపై చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సవిత..

Read Also: Delhi: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఇక, వాలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ జరిగింది.. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని తెలిపారు అధికారులు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వాలంటీర్లతో వైఎస్‌ జగన్ రాజీనామా చేయించాడని పలువురు మంత్రులు గుర్తుచేశారు.. తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని విమర్శించారు.. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Show comments