NTV Telugu Site icon

AP Budget 2025-26: నేడు ఏపీ బడ్జెట్‌.. రూ.3.20 లక్షల కోట్ల అంచనాలతో..

Ap Budget

Ap Budget

AP Budget 2025-26: ఇవాళ అసెంబ్లీ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఉద‌యం 9గంట‌ల‌కు కేబినెట్ అమోదించాక‌.. సభలో ఆర్ధికమంత్రి ప‌య్యావుల కేశ‌వ్ బ‌డ్జెట్ ప్రవేశ‌పెడతారు. మరి కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎలా ఉండబోతోంది. ఏపీలో అధికారంలోకి వ‌చ్చాక పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతోంది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌తో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి విజన్ 2047 లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3.20 లక్షల కోట్లతో బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టే అవ‌కాశం ఉంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ఉంటుంది. అందులో బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత 10 గంటలకు శాసనసభలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్ధిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెడతారు.

Read Also: Sabdham Movie Review: శబ్దం మూవీ రివ్యూ..ఆత్మహత్యలా? ఆత్మల హత్యలా ?

తల్లికి వందనం పథకంతో పాటు అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి పథకాలను అమలు చేయాల్సి ఉంది. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రాధాన్యతలను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారివారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ఆస్కారం ఉన్నట్టు సమాచారం. డ్వాక్రా మహిళలు, రైతులకు ఆర్ధికంగా చేయూతనిచ్చేలా వారికి వడ్డీలేనిరుణాల అంశాన్ని కూడా బడ్జెట్లో పేర్కోనే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రీడ్ బీమా యోజనను కూడా ప్రభుత్వం ప్రకటించనుందని సమాచారం. డిజిటల్ గవర్నెన్స్, ఐటీ హబ్‌ల అభివృద్ధి, పరిశ్రమల వృద్ధి తదితర రంగాల్లో ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల, ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Read Also: Off The Record : డైలీ సీరియల్ లా సాగుతున్న తాడిపత్రి పాలిటిక్స్

అసెంబ్లీలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెడితే.. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అలాగే.. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర.. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 2024 జూలైలో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయిలో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావడంతో.. ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. దేశంలోనే రెండ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.