AP BJP: అమరావతి పర్యటనకు ప్రధాని మోడీ.. ఏపీ బీజేపీ స్పెషల్ ఫోకస్..!
- మే 2న రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ..
- ప్రధాని రాకను కూటమి పార్టీలు తమ స్టైల్ లో ఏర్పాట్లు..
- భారీగా జన సమీకరణ చేయాలని బీజేపీ నిర్ణయం..
- బీజేపీ లుక్ కనిపించేలా చూడాలని కావాల్సిన ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP BJP: మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ వస్తున్నారు.. అయితే.. ప్రధాని రాకను కూటమి పార్టీలు తమ స్టైల్ లో వినియోగించుకుంటున్నాయట.. బీజేపీ సైతం భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించిందట.. ప్రతీ జిల్లా నుంచి కో-ఆర్డినేటర్లను సిద్ధం చేసారట.. అలాగే ప్రధానంగా బీజేపీ లుక్ కనిపించేలా చూడాలని కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారట.. కూటమి పార్టీలలో ప్రతీ విషయంలో కూటమి ధర్మం పేరిట వెనక ఉండిపోయిన బీజేపీని ముందుకు తీసుకురావడానికి మోడీ రాకను వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేసారట.. క్షేత్రస్ధాయి బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న ఏపీ బీజేపీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిగా ప్రణాళిక వేసుకుందని సమాచారం.. అమరావతి నుంచి పోలవరం దాకా ప్రతీ అంశంలోనూ బీజేపీ సహకారం ఎంత ఉందో చూపించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారట…
Read Also: AP Capital Amaravati: అమరావతి రాజధానికి చట్టబద్ధత..!
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
బీజేపీ శ్రేణులను భారీస్థాయిలో సిద్ధం చేసి, కాషాయ జెండాలు కనిపించేలా చేయాలని కోర్ కమిటీ సమావేశంలో సూచించారట.. ఏపీలో బీజేపీ ఏం చేసింది, కేంద్రం ఇచ్చిన పథకాలు, చేస్తున్న అభివృద్ధి తెలిపేలా ఉండాలని నిర్ణయించారట.. దీంతో కూటమిలో బీజేపీ ఎంత బలమైన స్ధానంలో ఉందో చూపించాలనే ఈ ప్రణాళికలు అని చర్చించుకుంటున్నారట కేడర్.. మరోవైపు అమరావతి ఏపీ రాజధానిగా గుర్తించామనే విషయాన్ని కూడా చూపించబోతున్నారట.. ఏపీలో బీజేపీ స్ధానాన్ని బలపర్చుకోవడానికి మే 2ను పూర్తిస్ధాయిలో ఎంతవరకూ వినియోగించుకుంటుందో చూడాలి మరి..
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్‌లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?