NTV Telugu Site icon

AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 27.28 గంటల పాటు సభ

Ayyanna Patrudu

Ayyanna Patrudu

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.. 16వ శాసన సభ మొదటి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు.. ఈ సందర్భంగా స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. మొత్తం 27 గంటల 28 నిముషాల పాటు సభ కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు.. శాసన సభలో సభ్యులు 36 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారని.. అందులో స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటిగా పేర్కొన్నారు..

Read Also: HMD Crest: తక్కువ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లతో ఫోన్స్‭ను విడుదల చేసిన ఎచ్ఎండి..

ఇక, శాసనసభలో సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు ప్రకటనలు చేసినట్టు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.. ప్రవేశపెట్టిన బిల్లులు 2 కాగా.. ఆమోదం పొందిన బిల్లులు కూడా 2గా వివరణ ఇచ్చారు.. మొత్తం శాసన సభలో 68 మంది సభ్యులు ప్రసంగించారని వెల్లడించారు.. 344 నిబంధన కింద ఒక చర్చ కూడా సాగిందన్నారు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు. కాగా, ఈనెల 22 నుంచి ప్రారంభమైన సమావేశాలు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఐదు రోజుల పాటు కొనసాగాయి. తొలిరోజు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాల్లో పాల్గొన్నారు.. ఇక, సభ ప్రారంభమైన రోజు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు , వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి సమావేశాలు హాజరుకాగా.. రాష్ట్రంలో ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తుందని ఆరోపిస్తూ కేవలం 15 నిమిషాల వ్యవధిలోనూ అసెంబ్లీ సమావేశాలను వాకౌట్‌ చేసి వెళ్లిపోయిన విషయం విదితమే..

Read Also: Snake vs centipede: పాముతో జెర్రి బిగ్ ఫైట్.. చివరకు?

గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగాయి.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసగించారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఆ తర్వాత మద్యం పాలసీ, శాంతి భద్రతలు, ఆర్థికశాఖలపై చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ.. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిపేందుకే.. శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.