Iftar Party: రాష్ట్రస్థాయి, జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందులు.. ఏర్పాట్ల కోసం నిధులు విడుదల..
- 16 న విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్..
- రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ ఏర్పాట్లు..
- ఇఫ్తార్ ఏర్పాట్ల కోసం రూ. 1.50 కోట్లు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iftar Party: రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. ముస్లిం మైనారిటీలకు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన రంజాన్ మాసంలో సాయంకాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 16వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలో ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు రానున్న 4, 5 రోజులలో జిల్లా స్థాయి ఇఫ్తార్ కార్యక్రమాన్ని వారికి అనువైన రోజున నిర్వహిస్తారు. ఇఫ్తార్ ను జిల్లాస్థాయిలో ఆయా జిల్లాల కలెక్టర్లు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా, మనోరంజకంగా నిర్వహించాలని న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశించారు.
రాష్ట్రస్థాయి ఇఫ్తార్ కు రూ.75 లక్షలు
విజయవాడ ఏ- కన్వెన్షన్ సెంటర్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేయబోయే రాష్ట్రస్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి రూ.75 లక్షలు మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇఫ్తార్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ. 1.50 కోట్లు మొత్తంలో రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ నిర్వహణ కు పోను, మిగతా రూ. 75 లక్షలు మొత్తాన్ని జిల్లాల వారీగా కేటాయించి ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాస్థాయిలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇఫ్తార్ నిర్వహణకు నిధులు కేటాయిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులకు నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పజెప్పడం జరిగిందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. వివిధ వర్గాల ప్రజలు ఇఫ్తార్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ప్రజలందరిలో మత సామరస్యం, సోదరభావం, ఐక్యతాభావం పెంపొంది, తద్వారా సమాజ పురోగతి మరింత ముందుకు సాగుతుందని మైనారిటీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!