Ande Sri Pass Away: కవి, రచయిత అందెశ్రీ కన్నుమూయడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. అందెశ్రీ మృతిపై సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. “ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది.. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..” అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు..
Read Also: T20 World Cup 2026: ప్రపంచకప్ కోసం 8 వేదికలు షార్ట్‌లిస్ట్.. టీమ్స్, ఫార్మాట్ డీటెయిల్స్ ఇవే!
”ప్రముఖ తెలుగు సాహితీవేత్త, గేయ రచయిత అందెశ్రీ గారి మరణం బాధాకరం అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యా్.. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. ఆయన రచనా ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటుంది. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేశారు. తెలంగాణ జానపదాలపై, మాండలికంపై పట్టు కలిగిన రచయిత ఆయన.. పలు సినీ గీతాలు రచించారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…’ గీతం వింటే సమాజాన్ని అందెశ్రీ ఎంతగా చదివారో అర్థమవుతుంది. ‘తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం” రచించి తెలంగాణ చరిత్రలో ఆయన చిరస్మరణీయంగా నిలిచారు. అందెశ్రీ గారి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్..
Read Also: Haryana: ఫరీదాబాద్‌లో ఉగ్ర కలకలం… భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
ఇక, ”ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..” అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు ఏపీ మంత్రి నారా లోకేష్..
ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/2sotFqj6fC
— N Chandrababu Naidu (@ncbn) November 10, 2025
కవి శ్రీ అందెశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలి
కవి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన శ్రీ అందెశ్రీ గారు హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన రచనా ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటుంది. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 10, 2025
ప్రజాకవి అందెశ్రీ గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. "మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు" అనే పాటతోపాటు ఎన్నో ఉద్యమ గీతాలు రాసిన ప్రజాకవికి హృదయపూర్వక శ్రద్ధాంజలి. సాహిత్యానికి అందెశ్రీ గారు అందించిన సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి… pic.twitter.com/teMERs63wW
— Lokesh Nara (@naralokesh) November 10, 2025