Ambati Rambabu: సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమం అయినా మాపై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పులివెందులకు స్వాతంత్ర్యం వచ్చిందట.. ఇంత వరకు అంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండదు.. అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటే గ్రామాల్లోకి వెళ్ళి సిరా చుక్కలు చూపించాలి.. వాళ్ళు విడుదల చేసిన ఫోటోల్లోనే జమ్మలమడుగు మార్కెట్ యార్డు చైర్మన్ ఓటు వేయటానికి క్యూలైన్లో ఉన్నారు.. దౌర్భాగ్యమైన పాలన చేస్తూ మాపై అభాండాలు వేస్తున్నారు.. చంద్రబాబుకు ఆయన చెల్లెళ్ళు రాఖీ కట్టిన సందర్భం ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
ఇక, లోకేష్ కోతలు కోయటమే కానీ మీ ఇంటి గృహ శంకుస్థాపనకు మీ మేనత్తలను పిలిచారా అని మాజీమంత్రి అంబటి రాంబాబు అడిగారు. కాస్త చూసుకుని మాట్లాడండి లోకేష్.. మీ నాన్న మీ బాబాయిని ఎలా చూశారో అందరు చూశారు.. ఎన్నికల తర్వాత 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు నిజాయితీగా ఎన్నికలు చేస్తే పోలైన ఓట్లకు.. కౌంటింగ్ చేసిన ఓట్లకు 12.5 శాతం ఓట్లు పెరిగాయో పవన్ చెప్పాలి.. చంద్రబాబు, రేవంత్, రాహుల్ హాట్ లైన్ లో ఉన్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ కరెక్ట్.. చంద్రబాబు ఎప్పుడూ ఏ అవతారం అయినా ఎత్తుతారు.. ఇక సిద్ధాంతం, నిబద్ధత లేని వ్యక్తి చంద్రబాబు.. ఆయనకు అవసరం అయితే బీజేపీకి వెళ్తాడు.. అటు నుంచి కాంగ్రెస్ అంటారు.. మల్లీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వస్తారు.. ఎప్పుడు ఎటైనా తిరుగుతారని అంబటి రాంబాబు విమర్శించారు.
