ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్ల ఖరారు ఆలస్యం అయింది. అయితే తాజాగా టెండర్లు పిలుచుకోవచ్చని.. కానీ ఖరారు చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 62 పనులకు ఏపీ సీఆర్‌డీఏ, ఏడీసీ టెండర్లకు పిలిచింది. సుమారు రూ.42 వేల కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో మరో 11 పనులకు కూడా టెండర్లు పిలవనున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30 వేల మంది కార్మికులు పనులు చేస్తారని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vishnuvardhan Reddy: కృష్ణా జలాలపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీకి క్షమాపణ చెప్పాలి
అమరావతి నిర్మాణ పనులకు కేంద్రం నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి అండగా ఉంటామని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్ర సహకారంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే కేంద్ర సహకారంతో ఆయా ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Bird Flu : నల్గొండలో బర్డ్‌ఫ్లూ..? 7 వేల కోళ్లు పాతిపెట్టిన వైనం..