Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పునఃనిర్మాణ పనులు స్పీడందుకున్నాయి.. రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బాంక్ నుంచి నిధులు విడుదల అయ్యాయి.. దీంతో, పనుల్లో వేగం పెరిగింది.. 2019లో జరిగిన ఎన్నికలకు ముందే రాజధాని పనులు ఆగిపోయాయి.. అప్పట్లో ఏపీ సచివాలయ శాశ్వత భవనం పునాది, హైకోర్టు ఏర్పాటు కోసం పునాది నిర్మించారు. కానీ, ఆ పునాది ప్రాంతాల్లో వర్షం నీళ్లు నిలిచిపోయాయి.. వాటిని తోడే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. కాగా, సచివాలయ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.. 40 నుంచి 50 అంతస్థులు ఉండే విధంగా ఏర్పాటు జరిగింది.. సరిగ్గా 2018 డిసెంబర్ 27న నిర్మాణ పనులు ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు..
Read Also: Sonia Gandhi: గాంధీ వారసత్వం ముప్పులో ఉంది.. బీజేపీ,ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు..
బాగా ఎత్తైన రెండు టవర్లు ఏర్పాటు చేయాలని అప్పుడు పనులు ప్రారంభించారు… తర్వాత జరిగిన పరిణామాలతో రాజధాని పనులు ఆగిపోయాయి.. మళ్లీ ఇప్పుడు సరిగ్గా ఇదే టైంకు పనులు ప్రారంభం అవుతున్నాయి. శాశ్వత నిర్మాణాల కోసం వేసిన పునాదిలో ప్రస్తుతం నీళ్లు చేరాయి.. ప్రభుత్వం దీనిపై నిపుణులతో అధ్యయనం చేయించింది… ఐఐటీ హైదరాబాద్ బృందం నీటి లోపల ఉన్న పునాదులు పరిశీలించింది. పునాదులకు ఎలాంటి ఢోకా లేదని పనులు చేసుకోవచ్చని ఈ బృందం సూచించింది. దీంతో, ట్రాక్టర్ల ఇంజన్‌లకి భారీ మోటార్లు అమర్చి నీటిని తోడే కార్యక్రమం జరుగుతోంది.
Read Also: YS Jagan Praja Darbar in Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్.. పోటెత్తిన జనం
రాజధాని పనులకి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ జరుగుతోంది.. సీఆర్డీఏ అథారిటీ కూడా తరచు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సమావేశాలు జరుపుతోంది.. రాజధాని పనులకు ఆమోదం కూడా తెలుపుతోంది సీఆర్డీఏ అథారిటీ.. బహుశా వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు పిలిచే అవకాశం కూడా ఉంది. అమరావతితో పాటు 26 జిల్లాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు మంత్రి నారాయణ.. రాజధాని పనులుపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టింది.. టెండర్ల ప్రక్రియ పూర్తయితే మరింత వేగంగా పనులు జరిగే అవకాశం ఉంది.