Maoist Threat Letters: మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు.. 99 శాతం ఫేక్..
- మంత్రులకు మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖలన్నీ 99 శాతం ఫేక్ లెటర్స్..
- శంషాబాద్ ప్రాంతంలోని సర్పంచ్ ఫోన్ నెంబర్‌తో వచ్చిన బెదిరింపు లేఖ..
- ఇలా లేఖలు వచ్చిన సంగతి సర్పంచ్ కూడా తెలియదు...
- ప్రత్యేకంగా ఈ నలుగురు మంత్రులకే రావడం వెనుక పెద్ద కారణాలు ఏమీ లేవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Threat Letters: మంత్రులకు మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖలపై ఇంటెలిజెన్స్ విభాగం స్పష్టత ఇచ్చింది. ఆ లేఖల్లో 99 శాతం ఫేక్ అని ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. తెలంగాణలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక సర్పంచ్ ఫోన్ నంబర్‌తో ఈ బెదిరింపు లేఖ పంపినట్లు గుర్తించినట్లు చెప్పారు. అయితే, ఇలా లేఖలు వచ్చిన విషయం ఆ సర్పంచ్‌కే తెలియదని వెల్లడించారు. ప్రత్యేకంగా నలుగురు మంత్రులకే ఈ లేఖలు రావడం వెనుక పెద్ద కారణాలు లేవని, బహుశా వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఇలా చేయించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బెదిరింపు లేఖలు అందిన మంత్రుల నివాసాల వద్ద భద్రత పెంచాలని సంబంధిత విభాగానికి సూచించినట్లు తెలిపారు. ఈ లేఖల వ్యవహారంపై లోతైన విచారణ కొనసాగుతోందని ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
కాగా, నలుగురు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే.. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్రకు మావోయిస్టుల నుంచి బెదిరింపుల లేఖలు వచ్చాయి.. అంతే కాదు.. చంపేస్తాం.. జాగ్రత్త అంటూ లేఖలో హెచ్చరించారు దుండగులు.. దీంతో, అలర్ట్ అయిన పోలీసులు లేఖల వెనుక ఎవరు? ఉన్నారు అని ఆరీ తీసే పనిలో పడ్డారు.. అందులో భాగంగానే.. అవి 99 శాతం ఫేక్ లెటర్స్ అని తేల్చారు..
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!