Pregnant Woman in Dolly: ప్రసవానికి ఎన్ని కష్టాలు..! వర్షంలో కిలోమీటర్ నడక, 4 కిలో మీటర్లు డోలీలో..
- గిరిజనులకు తప్పని కష్ణాలు..
- రహదారి సౌకర్యం లేక వర్షంలో కిలోమీటర్ కాలినడక..
- 4 కిలో మీటర్లు డోలీలో గర్భిణి ప్రయాణం..
- అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చింతలపాలెంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnant Woman in Dolly: గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు.. ప్రభుత్వాలు మారినా.. కొత్త పీఎంలు వచ్చినా.. నయా ముఖ్యమంత్రులు పీఠాలు ఎక్కినా.. ఇంకా.. కనీస సౌకర్యాలకు ఆమడం దూరంలోనే బతుకులు వెళ్లదీస్తున్నారు.. చివరకు అనారోగ్యం చేసి ఆస్పత్రికి వెళ్లాలన్నా.. ప్రసవం కోసం పెద్దాస్పత్రిలో చేరాలన్నా.. ఇంకా వాళ్లు డోలీని ఆశ్రయించాల్సిన పరిస్థితి.. తాజాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గర్భిణికి డోలీమోత తప్పలేదు.. అనంతగిరి మండలంలోని మారుమూల పెదకోట పంచాయతీ చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని ఆస్పత్రికి డోలీలో తరలించిన సంఘటన చోటుచేసుకుంది.
Read Also: Bangladesh: హైదరాబాద్‌లోకి భారీగా చొరబడ్డ బంగ్లాదేశ్ వాసులు.. 20 మంది అరెస్ట్!
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!
చింతలపాలెం గ్రామానికి చెందిన కొర్రా జానకి నిండు గర్భిణీ.. ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. అయితే, గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో, కుటుంబ సభ్యులు ఆమెను డోలీలో ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. చింతలపాలెం నుంచి సుమారు కిలోమీటరు మేర డోలీపై తీసుకువచ్చారు. బూసిపుట్టు సమీపంలోకి వచ్చేసరికి పూర్తిగా దారిలేకపోవడం, వర్షాలకు కొండవాలును ఆనుకుని వరద నీరు ప్రవహించడంతో సుమారు కిలోమీటరు మేర నిండు గర్భిణిని నడిపించాల్సి వచ్చింది. అక్కడ నుంచి కొండిభకోట వరకు నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకువచ్చి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను అతి కష్టం మీద దాటించారు. అక్కడ నుంచి కొంతదూరం మోసుకు వచ్చి రేగుళ్లపాలెం మెయిన్‌రోడ్డు నుంచి ఫీడర్ అంబులెన్స్ ద్వారా ఆమెను ఆస్పత్రికి తరలించారు. రహదారి లేక అష్టకష్టాలు పడుతున్నామని, ఇప్పటికైనా రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తు్న్నారు..
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..