Maoists: అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం ముగిసింది. సురేష్, వాసు, అనితల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. ఈ నెల 18, 19వ తేదీలలో జరిగిన ఎన్ కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్నటి వరకు 10 మృతదేహాలను అప్పగించారు. మిగతా మూడు మృతదేహాలకు కూడా పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. ఈ మృతదేహాలను ప్రత్యేక వాహనాలలో తమ స్వస్థలం అయినా ఛత్తీస్ గఢ్ కి మృతుల బంధువులు తీసుకుని వెళ్లారు. ఇక, ఆ వాహనాలను పోలీసులు ఫాలో అయ్యారు.
Read Also: Delhi: ఢిల్లీని ముంచెత్తుతున్న కాలుష్యం, గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో కఠిన ఆంక్షలు అమలు !
అయితే, మావోయిస్టు కార్యకలాపాల నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం నాడు రంపచోడవరం సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. మారేడిమిల్లి అటవి ప్రాంతంలో రెండు ఎన్ కౌంర్లు జరిగాయి.. హిడ్మా, టెక్ శంకర్ గ్రూపులకు సంబంధించిన మొత్తం 13 మంది ఎన్ కౌంటర్ అయ్యారు.. మిగిలిన మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నాం.. సంభవ్ ఆపరేషన్ కొనసాగుతుంది.. మావోయిస్టులను నిర్మూలించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం అని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు.