ప్రచార ఆర్భాటమే తప్ప.. ప్రజల్ని పట్టించుకోని జగన్ సర్కార్: అచ్చెన్నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు జగన్ సర్కార్ ఉద్దరించింది ఏం లేదని మండి పడ్డారు. టీడీపీ హయాంలో చేనేతలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు చాలా ఇచ్చామన్నారు. సొంత మగ్గం లేకున్నా రిబేటుతో సహా ఏడాదికి రూ. లక్ష సాయం అందజేశామని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
Read Also: ఇది చాలా మంచి బడ్జెట్: రామకృష్ణ
Also Read
నూలు, రంగులు ఇతర వస్తువులపై సబ్సిడీలు అందేవని అవేవి ఇప్పుడు అందడం లేదని ఆరోపించారు. ఆప్కో ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పథకాలు లేవు, ఆ సబ్సీడీలు లేవు మార్కెటింగ్ లేదు. చివరికి స్కూల్ యూనిఫాం కూడా పవర్ లూంకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి ప్రచారం, అసమర్థ పాలనతోనే చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. పెడన ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
Achennaiudu criticized the Jagan government.
తాజావార్తలు
-
Sunitha : ఆ చేతులు వేయడం తప్పట్లేదు!” కాస్టింగ్ కౌచ్‌పై సునీత సంచలన నిజాలు
-
Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
-
Sunitha : మై బాడీ మై రైట్ అంటే, వాడి కళ్ళు వాడి ఇష్టం!” ఫెమినిజంపై సునీత షాకింగ్ కామెంట్స్!
-
Samantha: సింగిల్స్‌కు సమంత పవర్ఫుల్ అడ్వైజ్.. ఆ ఒక్క క్వాలిటీ ఉంటేనే ఓకే చెప్పండి!
-
Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!