పక్క స్కెచ్ తో కన్న కొడుకుని హత్య చేయించాడు ఓ తండ్రి.. పైగా తనకు ఏమి తెలియదన్నట్టు నటించాడు. పోలీసులకు అనుమానం రావటంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, తిరుపతిలోని పీలేరులో ఈ నెల 16వ తేదీన కేవీపల్లి మండలం తువ్వ పల్లి వద్ద గిరిబాబును గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్ళతో నరికి చంపారు. తన కొడుకు చంపేశారంటూ పోలీసులకు తండ్రి జయరాం ఫిర్యాదు చేశారు. కన్న కొడుకు గిరి బాబు చెడు వ్యసనాలకు బానిస అయ్యి డబ్బులు ఇవ్వమని తరచూ ఆయన్ను వేధిస్తుండటంతో ఈ హత్యకు స్కెచ్ గీశాడు. కొడుకు హత్యకు కిరాయి హంతకులకు రూ. 9,00,000 లక్షలను తండ్రి జయరాం సుపారికి ఇచ్చారు. విచారణలో పోలీసులు తండ్రి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం దర్యాప్తులో తండ్రి సహా మరో ముగ్గురిని కేవీపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.