Husband Killed Wife: భార్య గొంతు కోసిన భర్త.. కథలో ఊహించని ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Chittoor Man Killed His Wife For Having Extramarital Affair: వివాహేతర సంబంధాలకు కాపురాలు కూలిపోవడమే కాదు, దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయిన వారినే చంపుకునే దాకా మనుషులు బరితెగించేస్తున్నారు. ప్రియురాళ్ల కోసం భార్యని, ప్రియుళ్ల కోసం భర్తల్ని హతమార్చడం వంటి ఘాతుకాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి దారుణమే ఒకటి వెలుగు చూసింది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో.. భార్యని ఓ భర్త గొంతుకోసి చంపేశాడు. ఈ కథలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. తొలుత ప్రియుడి కోసం ఆ భార్య తన భర్తనే కడతేర్చాలని ప్లాన్ చేసింది. కానీ.. అది వర్కౌట్ అవ్వలేదు. సినిమాల్లో లెవెల్లో త్రిల్లింగ్‌గా అనిపించే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Chatthishgar : ఛీ.. ఛీ.. నువ్వు అస్సలు మనిషివేనా?
Also Read
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లిలో నాగరాజు, రేఖ (26) అనే దంపతులు నివాసముంటున్నారు. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ, తిమ్మరాజు అనే వ్యక్తి రాకతో కథ మారింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిమ్మరాజుకు అనుకోకుండా రేఖతో పరిచయం అయ్యింది. కొన్ని రోజులకే అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. తొలుత ఎవ్వరికీ తెలియకుండా రేఖ, తిమ్మరాజు కలిసి తమ రాసలీలలు కొనసాగించారు. అయితే.. వీరి గుట్టు ఎంతోకాలం దాగి ఉండలేదు. ఒకరోజు వీళ్లిద్దరు నాగరాజుకి అడ్డంగా దొరికిపోయారు. అప్పుడు అతడు ఇద్దరినీ మందలించాడు. మరోసారి తన భార్యని కలవొద్దని తిమ్మరాజుకి వార్నింగ్ ఇచ్చాడు. అటు, తప్పు చేసిన తన భార్యని క్షమించి, ఆమెతో మునుపటిలాగే సంసార జీవితాన్ని కొనసాగించాడు. అయితే.. రేఖ మాత్రం తిమ్మరాజుని విడిచి ఉండలేకపోయింది. అతనితోనే జీవితాంతం ఉండాలని నిర్ణయించుకుంది.
GDP Growth: 2000 – 2020 మధ్య అత్యధిక జీడీపీ గ్రోత్ కలిగిన టాప్-10 దేశాలు
ఈ క్రమంలోనే అడ్డుగా ఉన్న తన భర్త నాగరాజుని అంతమొందించాలని, ప్రియుడితో కలిసి రేఖ ప్లాన్ చేసింది. కానీ, అది వర్కౌట్ అవ్వలేదు. ఫ్లాప్ అయ్యింది. దీంతో.. మరోసారి పక్కా ప్లాన్ వేయాలనుకున్న రేఖ, తిమ్మరాజు.. ఎప్పట్లాగే మళ్లీ తరచు కలుసుకోవడం మొదలుపెట్టారు. అయితే.. ఇటీవల వీళ్లిద్దరు మరోసారి నాగరాజు మళ్లీ దొరికారు. దాంతో కోపాద్రిక్తుడైన నాగరాజు.. తిమ్మరాజుని కలవొద్దని భార్యని మందలించాడు. ఆమెతో గొడవకు దిగాడు. రేఖ మాత్రం తిమ్మరాజుని విడిచి ఉండలేనంటూ తిరగబడింది. కోపాద్రిక్తుడైన భర్త.. కత్తి తీసుకొని భార్యపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!