NTV Telugu Site icon

Alla Nani: మాజీ మంత్రి ఆళ్ల నానిపై ఛీటింగ్ కేసు నమోదు..

Alla Nani

Alla Nani

Alla Nani: ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు మరికొందరిపై త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. ఇటీవల సార్వత్రిక ఎన్ని కల సమయంలో శాంతినగర్ లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ అపార్టుమెంట్లో వైసీపీ నాయకుడు దిరిశాల వరప్రసాద్ తదితరులతో కలిసి శాంతినగర్ కు చెందిన అవుటుపల్లి నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు. 4వ అంతస్తులో ప్రచారం ముగించుకొని కిందకు దిగేందుకు అందరూ లిఫ్ట్ ఎక్కారు.. ఆ సమయంలో అది ఫెయిలై కిందకు పడిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ క్రమంలో నాగమణికి గాయాలు కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు.

Read Also: Prices: దసరా పండగ వేళ భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

ఇక, సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్లు కూడా ఉన్నందున ఎన్నికల సంఘంతో ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. బాధితురాలు నాగమణికి వైద్య ఖర్చులు పెట్టుకుంటామని, ప్రమాద బీమా వచ్చేలా చేస్తాం, ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పట్లో ఆళ్ల నాని హామీ ఇచ్చారు. ఆ తరువాత ఆ వాలంటీర్ న్ని పట్టించుకోలేదు.. నష్టపరిహారం కూడా రాలేదు.. దీంతో బాధితురాలు గట్టిగా అడగగా నాయకులు బెదిరించారు. తరువాత నష్ట పరిహారం ఇవ్వకపోగా.. పట్టించుకోక పోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు త్రీటౌన్ పోలీసులు శనివారం రాత్రి ఆళ్ల నాని, దిరిశాల వరప్రసాద్, సుధీరా బాబు, జీలూ ఖాన్, కురెళ్ల రాంప్రసాద్ తో పాటు ప్రైవేటు వైద్యులు సునీల్ సందీప్, లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ ప్రెసిడెంట్, సెక్రటరీలపై కేసు నమోదు చేశారు.