ఉప ఎన్నికల పోలింగ్.. హుజురాబాద్‌లో ఇలా.. బద్వేల్లో అలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఇవాళ 13 రాష్ట్రాల్లో 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. అయితే, పోలింగ్ విషయంలో రెండు స్థానాల్లో స్పందన మాత్రం ఒకేలా లేదు.. హుజరాబాద్తో పోలిస్తే.. బద్వేల్ మాత్రం బాగా వెనుకబడింది.. ఇక, పోలింగ్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే.. హుజురాబాద్‌లో భారీగా పోలింగ్ పెరిగే అవకాశం ఉండగా.. బద్వేల్ మాత్రం కాస్త వెనుకబడే ఉండే అవకాశం ఉంది.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండు నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే.. హుజురాబాద్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం 1 గంట వరకు 45.63 శాతం పోలింగ్ నమోదు కాగా.. బద్వేల్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.47 శాతం పోలింగ్ మాత్రమే రికార్డు అయ్యింది. ఇక, హుజురాబాద్‌లో భారీ స్థాయిలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు.. బద్వేల్లో కాస్త భిన్నంగా ఉంది పరిస్థితి.. అయితే, హుజురాబాద్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు.
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!