Red Sandle Smugling: ఎర్రచందనం అక్రమ రవాణాలో కొంతమంది కొత్త దారులు వెతుకుతున్నారు. పుష్ప సినిమా స్టైలులో పశువుల దాణాను తీసుకువెళ్తున్నట్లు కలరింగ్ ఇచ్చి ఆ బస్తాల మాటున ఎర్రచందనాన్ని తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోలీసులు అనుమానంతో ఓ లారీని ఆపి తనిఖీలు నిర్వహించగా ఎర్రచందనం అక్రమ రవాణా వెలుగు చూసింది. అయితే ఈ అక్రమ రవాణా కోసం తిరుపతి-చెన్నై కాదని ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌ను ఎర్రచందనం దొంగలు ఎంచుకోవడం హైలెట్ అని చెప్పాలి. ఈ ఎర్రచందనాన్ని శేషాచలం అడవుల నుంచి ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌కు చేరవేశారు.
Read Also: స్టార్ హీరోలు స్థాపించిన రాజకీయ పార్టీలు ఏంటో తెలుసా..?
కాగా ఈ తనిఖీల్లో పోలీసులు దాదాపు 4,200 కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.2.20 కోట్లుగా ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని ఎస్.పాలెం నుంచి చెన్నైకు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేసి సంతబొమ్మాళి స్టేషన్‌కు తరలించారు. టెక్కలి-మిలియపుట్టి రోడ్డులో ఓ వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో టెక్కలి పోలీసులు కాపు కాసి ఈ వాహనాన్ని పట్టుకున్నారు. టెక్కలి పోలీస్ సర్కిల్ అధికారులతో సహా ఆముదాలవలస, నరసన్నపేట, పలాస, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సహా, ఫారెస్ట్ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా ముగ్గురు నిందితులతో పాటు ఎర్రచందనం అమ్మిన ప్రధాన ముద్దాయి శామ్యూల్ తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు వివరించారు.