40 Years Telugudesam Party: టీడీపీ అవసరమేంటో వివరించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో వెలుగెత్తి చాటిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. 40 నలభై వసంతాల తెలుగుదేశం ఆవిర్భావ వేడుకల లోగోను ఆవిష్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించింది.
రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయి. శుభసూచికంగా ఉంటుందని పసుపు రంగును ఎన్నుకున్నారు. బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది టీడీపీనే. టీడీపీ నలభై వసంతాల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం అన్నారు చంద్రబాబునాయుడు.
Also Read
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీనే. జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ తనదైన ముద్ర వేసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున గ్రామ గ్రామన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. జెండావిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలి. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలి. స్వర్గీయ నందమూరి తారకరామారావు హైదరాబాద్ లోని ఎమ్మెల్యేల క్వార్టర్సులో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యే క్వార్టర్సును సందర్శించి.. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పిస్తాం. హైదరాబాద్ ఎన్టీఆర్ భవనులో కార్యక్రమాలు చేపడతాం. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులంతా వస్తారన్నారు చంద్రబాబు.
మద్యంపై సభలో చర్చ పెట్టరా..? రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్ కనుసన్నల్లోనే సరఫరా అవుతుంది. మద్యంలోని ప్రిమీయం బ్రాండ్లు ఏపీలో కన్పించకుండా పోయాయి. కిళ్లీ కొట్టులో కూడా ఆన్ లైన్ పేమెంట్లు ఉంటే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్లు ఉండవా..? మద్యం విషయాన్ని మేం అంత తేలిగ్గా వదిలిపెట్టం. 42 మంది చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా..? మద్యం విషయంలో సీఎం జగన్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో మా ఎమ్మెల్యేలు వివరించారు. దీనిపై ప్రజల్లోకి వెళ్తాం అన్నారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
-
Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
-
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
-
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
-
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!