ఏపీ వైద్య రంగంలో కీలక మార్పులు.. 16 హెల్త్ హబ్‌లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించింది.. కరోనా నేపథ్యంలో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.. దీని కోసం త్వరలోనే కొత్త పాలసీని కూడా తీసుకువస్తోంది ఏపీ సర్కార్.. ఇవాళ కోవిడ్ పై సమీక్ష సీఎం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాలని అధికారులకు సూచించారు.. జిల్లా ప్రధాన కేంద్రాలు, ఆ జిల్లాల్లోని నగరాల్లో హెల్త్హబ్లను ఏర్పాటు చేయాలన్న ఆయన.. రాష్ట్రంలో కనీసం 16 చోట్ల ఈ హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేయాలని.. జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి కలుపుకుని మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఉండాలని.. ఒక్కో చోట కనీసంగా 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని.. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున కేటాయించాలని ఆదేశించారు.
మూడేళ్లలో కనీసంగా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాలని సూచించారు సీఎం వైఎస్ జగన్.. దీనివల్ల కనీసంగా 80 మల్టీ, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు వస్తాయన్న ఆయన.. వీటితోపాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్యకళాశాలలు, నర్సింగ్‌కాలేజీలు వస్తున్నాయని తెలిపారు.. ప్రభుత్వ పరంగా ఆరోగ్య రంగం బలోపేతం కావడంతోపాటు, మనం ఇచ్చే ప్రోత్సాహం కారణంగా ప్రైవేటు రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సీఎం.. ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లాకేంద్రంలో, కార్పొరేషన్లలో మల్టీస్పెషాల్టీ, స్పెషాల్టీ ఆస్పత్రులు వస్తాయన్నారు. దీనివల్ల టెరిషరీ కేర్ విస్తృతంగా మెరుగుపడుతుందని.. ఇతర ప్రాంతాలకు వైద్యానికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. ఒకనెలరోజుల్లో కొత్త పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం… అలాగే వ్యాక్సిన్ తయారీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారయ్యేలా కూడా తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. దీనిపైకూడా ఒక విధానాన్ని తీసుకురావాలన్నారు. ఇక, కొత్త పాలసీ వచ్చి.. అదు అమలు జరిగి హెల్త్ హబ్‌లు ఏర్పాటు జరిగితే.. ఏపీలో వైద్య రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా చెప్పవచ్చు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Tags
- health hubs
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!