బెజవాడలో ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు, భారీగా జరిమానా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కష్టకాలంలో ఇష్టానుసారం బిల్లులు వేస్తూ.. భారీగా ఫీజులు వేస్తూ ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలకు పూనుకుంది ఏపీ ప్రభుత్వం.. చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేయడం, ఆరోగ్య శ్రీకి బెడ్లు కేటాయించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది.. బెజవాడలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడంతో పాటు.. భారీగా జరిమానా విధించింది.. అందులో. సాయి దీపు ఆస్పత్రి, ఆంధ్రా ఆస్పత్రికి చెరో రూ.ఆరు లక్షల ఫైన్ వేశారు అధికారులు.. స్మైల్ ఆస్పత్రి, గుడివాడ ఈవీఆర్ ఆస్పత్రికి చెరో రూ. ఆరు లక్షల జరిమానా విధించారు. ఇక, లలిత లైఫ్ కేర్, లిబర్టీ ఆస్పత్రికి చెరో రూ. 4 లక్షలు, క్రేన్, వేదాంత ఆస్పత్రికి చెరో రూ.3 లక్షలు, సాయి మాధవి, సన్ రైజ్, పీవీ ప్రజ్ఞ ఆస్పత్రులకు రూ.రెండేసి లక్షల చొప్పున జరిమానా విధించారు. దీంతో.. ఇప్పటి వరకు జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులపై రూ. 56 లక్షల వరకు జరిమానా విధించారు అధికారులు..
మరోవైపు.. విజయవాడ కరోనా వైద్యం నుంచి క్రమంగా ప్రైవేట్ ఆస్పత్రులు తప్పుకుంటున్నాయి.. స్వచ్ఛందంగా కోవిడ్ వైద్యం అనుమతి రద్దు చేసుకున్నాయి నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులు.. అందులో.. లలిత లైఫ్ కేర్ ఆసుపత్రి, ఏంజె నాయుడు ఆసుపత్రి, క్రేన్ ఆసుపత్రి, శ్రీ శాంతి ఆసుపత్రి ఉన్నాయి.. పలు కారణాలతో కోవిడ్ వైద్యం అందించలేమని.. అనుమతి రద్దు చేయాలని అధికారులకు విన్నవించుకున్నాయి.. దీంతో.. వారి విజ్ఞప్తిని పరిశీలించి.. రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
Also Read
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?