NTV Telugu Site icon

CM Chandrababu Serious: తిరుపతి ఘటనపై సీఎం సీరియస్‌.. వారిని సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు..

Cbn

Cbn

CM Chandrababu Serious: తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదముందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. మీ ప్లానింగ్ ఏంటి.. భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ముఖ్యమంత్రి నిలదీశారు. పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని నివేదిక వచ్చిందని, బాధ్యులను ఫిక్స్ చేసి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అసలు కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదిక వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.

Read Also: Priyanka Chaturvedi: ‘‘వాళ్లను పాకిస్తానీలుగా పిలవండి’’.. ప్రియాంకా చతుర్వేది ట్వీట్‌పై స్పందించిన మస్క్..

టీటీడీ ఈవోతో పాటు జేఈవో గౌతమీపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇది పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం పని చేసేది నేర్చుకోండి.. మీరు సమాధానం చెప్పండి.. ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు.. ప్రతి ఒక్కరికి చెప్తున్నా.. పద్ధతి ప్రకారం నడుచుకోండి.. తమాషాలనుకోవద్దు అని వార్నింగ్‌ ఇచ్చారు చంద్రబాబు.. బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. ఇక్కడ నో ఎక్స్క్యూజ్.. అని స్పష్టం చేశారు.. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి.. ఎందుకు జరిగిందో చెప్పండి..? భక్తులను ఉంచేందుకు కొత్త ప్లేస్ ఎంపిక చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా? అని నిలదీశారు.. ఇక్కడ నియమించిన పోలీస్ ఆఫీసర్ కి జాగ్రత్తలు చెప్పారా..? ఆ గేటు తీస్తే తొక్కిసలాట జరుగుతుందని ఎందుకు ఊహించలేదు అని కలెక్టర్‌పై ఫైర్‌ అయ్యారు.. ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చింది..? టోకెన్లు ఆఫ్‌లైన్‌లో ఎన్ని ఇచ్చారు.. ఆన్‌లైన్‌లో ఎన్ని ఇచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. గత విధానం కొనసాగించకుండా కొత్త విధానం ఎంపిక చేసుకుని ఉండాల్సింది.. అలా చేస్తారని మిమ్మల్ని పంపించాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..

Show comments