నిందితుడు రాజు కోసం పోలీసుల గాలింపు.. కీలక ఆధారం లభ్యం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసును తెలంగాణ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని నిందితుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా డీజీపీ నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే గత ఆరురోజులుగా పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నా రాజు ఆచూకీ లభించకపోవడం గమనార్హం. నిందుతుడు నిర్మానుష్య ప్రదేశంలో దాక్కొని ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈక్రమంలోనే రాజుకు సంబంధించిన ప్రతీ విషయాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే అతడు ఏం పని చేస్తాడు? అతడి భార్య, పిల్లలు వగైరా వివరాలన్ని సేకరించారు. ఈక్రమంలోనే గతంలోనే రాజుపై ఓ కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కేసు విషయంలో చైతన్యపురి పోలీసులు రాజును పిలిచి విచారించారు. అప్పుడు పోలీసులు తీసిన ఫోటో ఇప్పుడు కేసులో నిందితుడిని గుర్తించేందుకు కీలకంగా మారింది.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
నిందుతుడి రాజు గంజాయితోపాటు కల్లు, మద్యానికి బానిస అని పోలీసుల విచారణలో తేలింది. అతడు డబ్బు కోసం అడ్డా కూలీ పనులు చేస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజు తన మేనత్త కుమార్తె మౌనికను రాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడి వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పోలీసులు కల్లు.. మద్యం దుకాణాలు.. లేబర్ అడ్డాల్లో గాలిస్తున్నారు. ఆరురోజులుగా నిందితుడి ఆచూకీ లభించకపోవడంతో అతడు నిర్మానుష్య ప్రదేశంలో తలదాచుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు నిందితుడు గుండు చేయించుకుని మాస్క్ పెట్టుకుని ఉన్నాడేమో అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే రాజు స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొడకండ్లతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు గాలించారు. రాజు సమీప బంధువులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైవేలపై గాలింపులు చేస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి లింక్ ఉన్న హైవేలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈమేరకు నిందితుడు రాజు నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించిన ఆనవాళ్లు పోలీసులకు లభించాయి.
నిందితుడి దగ్గర సెల్ ఫోన్ లేకపోవడంతో అతడిని పట్టుకోవడం పోలీసులకు కొంచెం కష్టంగా మారింది. అయితే ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని ఎలాగైనా పట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను కూడా అలెర్ట్ చేశారు. అన్ని బస్టాండ్లు, బస్సుల్లో నిందితుడికి సంబంధించిన పోస్టర్లు అంటించారు. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. నిందితుడి సమాచారం తెలిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరింది. ఆచూకీ తెలిపినవారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది.
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!