ఏపీకి కేంద్రం మొండిచేయి.. ‘మెట్రో’ ఇంకెప్పుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవ్యాంధ్ర ఏర్పడి దాదాపు ఏడేళ్లన్నరేళ్లు కావస్తోంది. విభజన హామీలో భాగంగా విశాఖకు రైల్వే జోన్ తోపాటు మైట్రో ట్రైన్ ప్రాజెక్టు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఏపీకి మెట్రో ట్రైన్ ప్రాజెక్టు మంజూరు కాకపోవడం శోచనీయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కు మాత్రమే మెట్రో రైలు ప్రాజెక్టును అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. టీఆర్ఎస్ సర్కారు హయాంలో మెట్రో ట్రైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్లో కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి. ఈ సదుపాయం వల్ల నగరవాసులకు రవాణా విషయంలో చాలా ఊరట కలిగిందని చెప్పొచ్చు.
నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కనీసం రాజధాని సైతం నిర్మించలేక పోయారు. ఇక ప్రతిష్టాత్మకమైన మైట్రో ట్రైన్ ప్రాజెక్టును ఏకంగా గాలికొదిలేశారు. దీంతో ఏపీకి మైట్రో ట్రైన్స్ సదుపాయం లేకుండా పోయింది. రోజురోజుకు పెరిగిపోతున్న నగర జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ కష్టాలను దూరం చేసేందుకు కేంద్రం మైట్రో రైళ్ల ప్రాజెక్టులను అన్ని రాష్ట్రాలకు కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఏపీకి మాత్రం మెట్రో ప్రాజెక్టు విషయంలో బీజేపీ సర్కారు మొండిచేయి చూపిస్తుంది.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
దేశంలోని ఈశాన్య, కేంద్ర ప్రాంతాలు మినహాయిస్తే అన్ని రాష్ట్రాల్లో మైట్రో రైళ్ల వ్యవస్థ అందుబాటులో ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి మైట్రో రైల్ వ్యవస్థ గుండెకాయగా మారింది. అక్కడ మరింత రైళ్ల నెట్ వర్క్ ను ప్రభుత్వం విస్తరిస్తోంది. తాజాగా నజఫ్ గడ్ నుంచి దౌసా బస్టాండ్ వరకు నిర్మించిన మెట్రో రైల్వే అందుబాటులోకి వచ్చింది. దీనిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తాజాగా ప్రారంభించారు. కాగా కేంద్రం 2022 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 900 కిలోమటర్ల మేరకు మెట్రో రైల్ ప్రాజెక్టును వేర్వేరు రాష్ట్రాలకు మంజూరు చేసింది.
వీటిలో 740 కిలోమీటర్ల మేరకు మైట్రో రైలు ప్రాజెక్టు పనులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది మంజూరు కాబోయే 900 కిలోమీటర్లను మైట్రో రైల్వే విస్తరణను పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా 2వేల కిలోమీటర్ల మైట్రో రహదారి అందుబాటులో రానుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతీయేటా కేంద్రం కొత్త మెట్రో ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. అయితే ఏపీకి మాత్రం ఇప్పటి కూడా ఒక్క మెట్రో ప్రాజెక్టు కూడా మంజూరు చేయకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో మెట్రో ట్రైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురంలో మెట్రో ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. ఇవన్నీ కూడా ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. కానీ దక్షిణాదిలో మెట్రో ట్రైన్ లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుంది. నవ్యాంధ్రకు మెట్రో ట్రైన్ ప్రాజెక్టు సాధించడంలో గత టీడీపీ సర్కారు ఘోరంగా విఫలమైంది.
ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలోనైనా ఏపీకి మెట్రో ప్రాజెక్టును తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించాలని అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Yashasvi Jaiswal Record: 30 వేదికలు, 30 మ్యాచ్‌లు.. టీమిండియా యువ ఓపెనర్ ఖాతాలో వింత రికార్డు!
-
Ashish Banerjee Death: మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి.. పార్టీ ఆఫీస్‌లో ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం
-
Ather Konark: 200KM రేంజ్.. 6 వేరియంట్లు?.. లాంచ్‌కు ముందు Ather Konark కీలక ఫీచర్లు లీక్
-
2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ తేదీలో మార్పులు? ఆ రోజే తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు ఇవే..
-
Psychology Facts: ‘నాకు ఎవరికీ చెప్పాలని లేదు..’ ఈ మాట వెనుక అంతులేని వేదన!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!