Pepper Cultivation : మిరియాల సాగులో మెళుకువలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మసాలా దినుసుల్లో ఘాటు కోసం వాడే వాటిల్లో మిరియాలు కూడా ఒకటి.. మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కువ అందుకే రైతులు వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇది తీగ జాతికి చెందిన మొక్కలు..బాగా ఎండిన మిరియాలను నల్ల మిరియాలను, పైన పొట్టు తీసిన వాటిని తెల్ల మిరియాలు అంటారు..ఆంధ్రప్రదేశ్లోని విశాఖజిల్లాలో పర్వత ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకు, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతాల్లో దీనిని సాగుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60,500 ఎక రాల్లో దీనిని సాగుచేస్తున్నారు.. ఇక పాడేరు కాఫీతోటల్లో దీన్ని అంతర్ పంటగా వేస్తున్నారు. ఇది వర్షధార పంట… ఈ పంట సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
మిరియాల సాగుకు అనువైన రకాలు..
Also Read
- Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో
- Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
- Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!
- Potato Farming : కొత్త టెక్నాలజీ.. భూమిలో కాకుండా గాల్లో ఆలుగడ్డ పండిస్తున్న వైనం
పన్నియుర్- 1:
ఎకరాకు 500 కిలోల ఎండు మిరియాల దిగుబడివస్తుంది. దీని ఆకులు వెడల్పుగా, కాయలు గుత్తులు పొడవుగా ఉంటాయి. ఒక్కో గుత్తిలో 125 గింజలుంటాయి. ఇది నీడను తట్టుకోలేదు. పైటోఫ్తోరా వంటి కుళ్ళు తెగులు సోకే అవకాశం ఉంది. తాజా మిరియాల నుంచి 35 శాతం ఎండు మిరియాలు వస్తాయి..
పన్నియుర్-2 :
ఎకరాకు 1000 కిలోల దిగుబడినిస్తుంది. కాయల గుత్తులు సుమారు 12 సెం.మీ. పొడవుంటాయి. ఒక్కో గుత్తికి 45 గింజలుంటాయి. తాజా మిరియాల నుంచి 35 శాతం మిరియాలు వస్తాయి.. అలాగే పనియర్ 3 కూడా 800 కిలోల దిగుబడిని అందిస్తుంది.. ఈ రెండు రకాలు మంచి దిగుబడిని ఇస్తున్నాయి. ఈ రెండు రకాలతో అధిక దిగుబడిని పొందోచ్చు..
తీగల నుంచి కొత్త మొక్కలను తయారు చేసి మంచి లాభాలను పొందవచ్చు.. తీగ అడుగుభాగం నుంచి సమాంతరంగా పెరిగే రన్నర్ కొమ్మలను 2-3 కణుపులున్న చిన్న కొమ్మలుగా కత్తిరించి నాటాలి. ఈ కొమ్మలను మార్చి- ఏప్రిల్ నెలల్లో తీసుకొని నారుమడిలో లేదా పాలి దీన్ సంచిలో నాటాలి. తర్వాత జూన్-జులైలో తోటలో నాటుకోవాలి. మిరి యాల తీగలు వేయడానికి మూడేళ్ల ముందు సిల్వర్క్ మొక్కలను 2.5-2.5 మీ. ఎడంలో నాటాలి. సిల్వర్క్ మొక్కల మొదళ్ళ వద్ద ఉత్తరదిశగా 50-50-50 పరిమాణమున్న గుంతలు తవ్వి మిరియాల తీగలను నాట్టుకోవడం మంచిది.. తీగ పాకేందుకు వీలుగా ఉంటుంది.. ఈ పంటలో ప్రతి తీగకు 10కిలోల పశువుల ఎరువు, 100గ్రా. నత్రజని, 40గ్రా. భాస్వరం, 140గ్రా పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. వీటిని సంవత్సరంలో రెండు దఫాలుగా అంటే మే నెలలో సగభాగం, మిగిలిన సగభాగం ఆగస్టు నుంచి సెప్టెంబరులో వేయాలి.. ఎండా కాలంలో ఎండిన ఆకులతో వేర్లను కప్పాలి.. ఫిబ్రవరి- ఏప్రిల్ నెలల్లో కత్తిరించాలి. కాపునిచ్చిన పక్క తీగలను ఒకటి ఉంచి రెండు ఆకులతో 3 కణుపులు ఉండేలా కత్తిరించాలి.. గుబురుగా మొక్కలు వచ్చి కాపు బాగా కాస్తాయి.. కత్తిరింపులలో సందేహాలు ఉంటే వ్యవసాయనిపుణుల సలహా తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!