Mulberry Fruits Farming : తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందే మల్బరీ సాగులో మెళుకువలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ పండ్లను ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము.. వీటిలో ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.. చాలామంది రైతులు ఈ పండ్లను సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ పంటను ఎలా సాగు చేయాలో పూర్తి మెలకువలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ మల్బరీ పండ్లను సాగు చేయడానికి విత్తనాలు అనేవి ఉండవు. మల్బరీ చెట్ల కొమ్మలను కత్తిరించి, ఆ కొమ్మలను నాటుకొని సాగు చేయాలి. మల్బరీను రెండు రకాలుగా సాగు చేస్తారు. ఒకటి పట్టుపురుగులకు ఆహారంగా మల్బరీను సాగు చేస్తారు. రెండవది మల్బరీ పండ్ల కోసం సాగు చేస్తారు. పట్టు పురుగులకు ఆహారంగా మల్బరీని సాగు చేయాలనుకుంటే మొక్కల మధ్య ఒక అడుగు దూరం ఉండాలి. అలా కాకుండా మల్బరీ పండ్ల కోసం నాటుకునే మొక్కల మధ్య 15 అడుగుల దూరం ఉండాలి. ఒక ఎకరం పొలంలో 240 మొక్కల వరకు నాటుకోవాలి. ఈ మొక్కలు నాటిన పది నెలల తర్వాత పండ్లు వస్తాయి. ఈ పండ్లు ప్రతి కాలంలో వస్తాయి. ఎలాంటి వాతావరణం లో అయినా తట్టుకొని దిగుబడి ఇస్తాయి..
Also Read
- Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో
- Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
- Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!
- Potato Farming : కొత్త టెక్నాలజీ.. భూమిలో కాకుండా గాల్లో ఆలుగడ్డ పండిస్తున్న వైనం
అయితే ఈ పంటను అధిక వర్షాలు పడే సమయంలో మాత్రం అస్సలు వెయ్యకూడదు.. వర్షాలకు దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది..చెట్లకు ప్రతి 45 రోజులకి ట్యూనింగ్ చేసుకోవాలి.అంటే ఆకులు మొత్తం కత్తిరించాలి. అలాగే మళ్లీ 45 రోజులకి పూత వస్తుంది.ఇక పక్షులు, పిట్టలు ఈ పండ్లను అధికంగా ఆశిస్తాయి. ఇక వాటి నుండి సంరక్షించుకోవడం కోసం చేపల వల పొలం చుట్టు, చెట్టు పై భాగంలో కట్టుకోవాలి. ఈ చెట్లకు చీడపీడల బెడద ఉండదు.. ఎక్కువగా నీటిని పెట్టవలసిన అవసరం కూడా లేదు.. ఇక ఎరువులు ఒకేసారి వేసుకుంటే సరిపోతుంది.ఒక ఎకరం పొలం నుంచి ప్రతిరోజు 100 కిలోల పండ్లు పొందవచ్చు.మార్కెట్లో కిలో దాదాపుగా ధర రూ.250 వరకు ఉంది.అంటే రోజుకు రూ.15 నుంచి రూ.20 వేల వరకు సంపాందించుకోవచ్చు.. ఈ పంట గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!