మనదేశంలో ఎక్కువగా పండించే పంటలలో మొక్క జొన్న కూడా ఒకటి.. వాణిజ్య పంట అయిన మొక్క జొన్నకు మార్కెట్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది..అంతేకాదు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పంట కాలం.. దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు ఈ పంటను వెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు…ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులు వేసుకోవాల్సిన మధ్య, స్వల్పకాలిక రకాల గురించి తెలియజే సూచిస్తున్నారు ప్రముఖ శాస్త్రవేత్తలు.. మొక్క జొన్న పంటల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. వర్షపాతం ఆధారంగా, సాగునీటికింద మొక్కజొన్నను విత్తుతున్నారు.. జూన్ రెండొవ వారంలో ఒక పదును వర్షం పడ్డాక మొక్క జొన్న విత్తుకోవడానికి నేలలు అనుకూలంగా ఉంటాయి.. అందుకే ప్రస్తుతం రైతులు మొక్క జొన్నను విత్తుకొనే పనిలో ఉన్నారు..
మొక్క జొన్నకు ప్రభుత్వ రకాలు:
డిహెచ్‌ఎం 117: ఈ రకం ఆకు ఎండు, కాండంకుళ్ళు తెగుళ్లను మరియు కాండం తొలిచే పురుగులను తట్టుకుంటుంది.
డిహెచ్‌ఎం 121: ఈ రకం పాము పొడ ఆకు ఎండు మరియు పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళు లేదా మసి కుళ్ళు తెగులును, కాండం తొలిచే పురుగును తట్టుకుంటుంది.
కరీంనగర్ మక్కా: ఈ రకం తుప్పు తెగులు, ఆకుమాడుతెగులు కొంత వరకు తట్టుకుంటుంది.
కరీంనగర్ మక్కా 1: ఈ రకం కాండం కుళ్ళు /ఎండు తెగులు,పాము పొడ తెగులు, ఆకుమాడు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. ప్రైవేటు రకాలు: కే 50, కె 8 3 22, బయో 9 5 44, పిఎసి 751, పిఎసి 741, పయనీర్ 3 59 2, ఎన్.కె 6 2 4 0, సిప్ 333, ఎస్ 6668 మొదలగు రకాలను ఎన్నుకొని విత్తుకోవాలి.
విత్తన మోతాదు ఎకరానికి 8 కిలోల విత్తనం సరిపోతుంది..
ఎరువులు నెలల భూసారాన్ని బట్టి వేసుకోవాలి..ఇక మొక్కజొన్న పంటకు నేల ఆధారంగా 6 నుంచి 10 తడులు యాసింగి మొక్కజొన్నకు అవసరం. ముఖ్యంగా మూడు దశలలో అనగా పూతకు ముందు, పూత దశలో మరియు గింజలు పాలు పోసుకునే దశలో నీరు తప్పకుండా ఈ పంటకివ్వాలి. కలుపును కూడా ఎప్పటికప్పుడు తీయిస్తూ ఉండాలి.. ఇంకేదైనా సమస్యలు వచ్చిన, మొక్క జొన్న పై మరింత సమాచారం కోసం వ్యవసాయ నిపుణులను సంప్రదించవలెను..