తొలిసారి శృంగారం అనగానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు మొదటిసారి కలయికలో పాల్గొనడం అంటే చాలా పెద్ద విషయం. 

 తొలిసారి శృంగారంలో పాల్గొనే ముందు మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.  ఆ ప్రశ్నలేంటంటే?

శృంగారం చేయడానికి మీరు కొంత ఒత్తిడిని అనుభవిస్తున్నారా? అని ప్రశ్నించుకోవాలి. 

ఈ రోజుల్లో పెళ్లికి ముందు శృంగారం కామన్‌ అని.. ఒక్కసారి కూడా రుచిచూడలేదా అని గేలిచేసి రెచ్చగొట్టచ్చు. కలయికలో పాల్గొనమని బలవంతం చేయొచ్చు.

మీ భాగస్వామి తమ శారీరక కోరికలను తీర్చుకోవడానికి కూడా సెక్స్ చేయమని ఒత్తిడి చేయవచ్చు. మీ స్నేహితుల్లో మీరు మాత్రమే వర్జిన్‌గా ఉన్నట్లయితే మీరు రేసులో వెనుకబడినట్లు భావించవచ్చు. 

ఈ భావాలు మిమ్మల్ని శృంగారంలో పాల్గొనేలా చేస్తాయి, కానీ ఆ భావాలపై చర్య తీసుకోవద్దు. 

ఎందుకంటే మీరు లోపల నుంచి సిద్ధంగా ఉంటే తప్ప, మీరు ఇతర వ్యక్తుల ఒత్తిడికి గురవుతున్నందున మాత్రమే శృంగారంలో పాల్గొనవద్దు.

మీరు శృంగారం చేయడానికి సిద్ధంగా లేకుంటే మీరు తర్వాత పశ్చాత్తాపం చెందే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. మీరు మీ జీవితంలో ఈ అడుగు వేయడానికి అసౌకర్యంగా, భయపడుతూ ఉంటే, మీరు దానికి సిద్ధంగా లేరు అని అర్థం.

మీరు నిజంగా విశ్వసించే, సురక్షితంగా భావించే వారితో మాత్రమే మొదటిసారి శృంగారంలో పాల్గొనండి. లేకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

సమ్మతి అనేది శృంగారంలో కీలకమైన భాగం. మీరు, మీ భాగస్వామి మొదటిసారి శృంగారంలో పాల్గొనే ముందు, మీరిద్దరూ ఏమి కోరుకుంటున్నారనే  దాని గురించి మీరిద్దరూ తెలుసుకోవాలి.

నేను నా కోసం శృంగారం చేస్తున్నానా అని ప్రశ్నించుకోండి. మీరు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నట్లు భావిస్తే, దాని కోసం వెళ్ళండి. కాకపోతే, వేచి ఉండండి.