NTV Telugu Site icon

YouTuber: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఓ యూట్యూబర్ ఏం చేశాడంటే..?

Up

Up

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు నేటి తరం యువత చేస్తున్న ప్రయోగాలు కొన్నిసార్లు వికటించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. నీలేశ్వర్ అనే యువకుడు ‘నీలేశ్వర్22’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు. అతడికి 8. 87 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా.. తన వ్యూయర్‌షిప్‌ను పెంచుకునేందుకు తాజాగా ఓ సాహసకృత్యం చేశాడు. దీంతో అది వికటించడంతో.. ఐదు గంటల పాటు కష్టపడిన పోలీసులు అతడ్ని అతికష్టం మీద సురక్షితంగా రక్షించారు.

Read Also: Indian Cricket Team: పాకిస్థాన్‌ ‘డాన్‌’ పత్రిక మొదటి పేజీలో టీమిండియా ఫొటో!

ఇక, సబ్‌స్క్రైబర్లతో పాటు వ్యూయర్‌షిప్‌ను కూడా పెంచుకోవాలని అనుకున్నా.. నీలేశ్వర్ తన స్నేహితుడి సహాయంతో స్టంట్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే గ్రేటర్ నోయిడాలోని టిగ్రి గ్రామంలో ఎత్తైన టవర్‌ ఎక్కేశాడు. కింద ఉన్న అతడి ఫ్రెండ్ దానిని లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. ఈ ప్రమాదకర స్టంట్‌ను చూసిన స్థానికులు అక్కడికి భారీగా చేరుకున్నారు. వారిని చూసి భయపడిన నీలేశ్వర్ స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

Read Also: Kashmir : పీఓకే జైలు నుంచి 20 మంది ఖైదీలు పరార్.. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

అయితే, టవర్ పైనే ఉండిపోయిన నీలేశ్వర్‌ అక్కడే ఉండిపోయాడు. కిందనున్న జనం ఏం జరుగుతుందో చూద్దామని అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు టవర్ దగ్గరకు చేరుకున్నారు. అయితే, అతడ్ని కిందికి దింపడంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. దాదాపు ఐదు గంటల పాటు కష్టపడిన తర్వాత నీలేశ్వర్‌‌ను పోలీసులు సురక్షితంగా కిందికి దించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నీలేశ్వర్‌పై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు.