Site icon NTV Telugu

Viral Video : తల్లి పులి అడుగుజాడల్లో నడుస్తున్న పులి పిల్లలు

Tiger

Tiger

సోషల్ మీడియాలో జంతువులుకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటాయి. అడవిలోని జంతువులకు సంబంధించిన వీడియాలకు మనకు చాలా మంది అభిమానులు ఉంటారు. అవి చేసే పనులు కొన్ని సార్లు భయం పుట్టిస్తే.. మరి కొన్నిసార్లు నవ్వులు పూయిస్తాయి. ఈ మధ్య జంతువుల వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Also Read : Navadeep: న్యూసెన్స్ చేయడంలో నేనే పెద్ద కంత్రీ..

అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో పులికి సంబంధించినది. ఈ వీడియోలో పులి దాని పిల్లలతో చూడొచ్చు.. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. పుటేజీలో.. పిల్లలు తల్లి పులితో కలిసి నడుస్తున్నట్లు మనం చూడవచ్చు. పులి ఎక్కడికి దాని పిల్లలు తల్లి పులిని అనుకరిస్తు వెళ్తుండటం మనం ఈ వీడియోలో చూడొచ్చు.

Also Read : The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమా ఆర్ఎస్ఎస్ కుట్ర.. సీఎం పినరయి విజయన్ విమర్శలు..

దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై ఇప్పటికే చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. తల్లిపులి అడవిలో నడుస్తూ ఉంటే.. వెనక నాలుగు పులి పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ తల్లిని ఫాలో అవుతూ కనిపించాయి. ఈ వీడియో చూడటానికి చాలా బాగుందంటూ నెట్టింట తెగ వైరల్ గా మారింది.

Also Read : Heart Health: హార్ట్ హెల్త్ ను మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్..

తల్లి పులి ఎలా చేస్తే ఈ పులి పిల్లలు కూడా అలా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన జంతు ప్రేమికులు తెగ సంబర పడుతున్నారు. దీంతో మరోసారి పులికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version