NTV Telugu Site icon

Viral Video: మహిళా ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్

Mp

Mp

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్కూల్ ఫీజుల విషయమై విద్యార్థి, ప్రిన్సిపాల్ మధ్య జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థి తన టీసీ, ధ్రువపత్రాలు తీసుకునేందుకు స్కూల్ కి వెళ్లాడు. అయితే ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ మేడమ్, విద్యార్థి మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తం ఫీజు చెల్లిస్తేనే మార్కు పత్రం ఇస్తామని ప్రిన్సిపాల్ తేల్చిచెప్పారు. దీంతో విద్యార్థి, ప్రధానోపాధ్యాయురాలి మధ్య గొడవ కాస్త పెరిగింది. ఈ తరుణంలో ఆ ఉపాధ్యాయులరాలు విద్యార్థిని కొట్టింది. కోపోద్రిక్తుడైన విద్యార్థి ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.

READ MORE: Satyabhama: వరంగల్‌లో స్టార్ మా ‘సత్యభామ’ టీం వరలక్ష్మీ వ్రతం వేడుకలు

ఈ ఘటన మొత్తం స్కూల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థిపై ప్రిన్సిపాల్‌ కేసు నమోదు చేయగా.. విద్యార్థి కూడా స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇరువురిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం ఈ విషయం నగరంలోని హజీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచ్ మిల్‌లో ఉన్న సీబీఎస్ అనే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినది. ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్న దళిత విద్యార్థి ధ్రువ్ ఆర్యను ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టారు. ప్రిన్సిపాల్ నిషా సెంగార్, వైస్ ప్రిన్సిపాల్ రాకేష్ సింగ్, రజనీ అనే టీచర్లు విద్యార్థిని కొట్టారు.

READ MORE:Andhra Pradesh: భారత్ నెట్ ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

విద్యార్థి ఫీజు కట్టలేదని అందుకే టీసీ ఇవ్వలేమని ప్రిన్సిపాల్‌ చెబుతున్నారు. కాగా పూర్తి ఫీజులు జమ చేశానని విద్యార్థి చెబుతున్నాడు. దళిత కులానికి చెందిన వాడని పాఠశాల ఉపాధ్యాయులు అప్పుడప్పుడూ దూషిస్తూనే ఉన్నారని విద్యార్థి ఆరోపించాడు. హజీరా పోలీసులు విద్యార్థిని ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ నిషా సెంగార్, రజనీ, రాకేష్ సింగ్‌లపై కేసు నమోదు చేశారు. ఈ విద్యార్థిపై కూడా బెదిరింపు ఆరోపణలపై కేసు నమోదు చేశారు.