రీల్స్ కోసం కొండ చివరన కారుతో స్టంట్లు చేయడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అదుపు తప్పడంతో 300 అడుగుల లోయలో జారీ పడింది. ఈ ఘటనలో సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో సహాయక బృందాలు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటి విన్యాసాలు చేయొద్దని పోలీసులు టూరిస్టులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.