ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే ( కృష్ణకుమార్ కున్నత్ ) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. లైవ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైనట్లు , ఆ తర్వాత హోటల్ చేరుకున్న అనంతరం ఆయన కుప్పకూలిపోయాడంతో.. కేకేను రాత్రి 10.30 గంటల సమయంలో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMRI)కి తరలించారు. అక్కడ వైద్యులు కేేకే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే, కేకే గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. పూర్తి కారణాలు తెలియరాలేదు.
ఆయన పార్థీవ దేహానికి ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం నివేదికలో మృతి గల కారణాలు స్పష్టంగా తెలియనున్నాయి. అయితే, కేకే మృతికి సంబంధించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కేకే ఆసుపత్రికి చేరిన సమయంలో తల, ముఖంపై గాయం గుర్తులున్నట్లు సమాచారం. గాయం ఎలా అయ్యిందనే తెలియాల్సి ఉంది. గాయం కారణంగానే మృతి చెందారా? లేదంటే గుండెపోటుతో మృతి చెందారా? అనే విషయం పోస్టుమార్టం నివేదికలో తేలిపోనున్నది.
మరో వైపు కేకే మరణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వాహకులు, హోటల్ సిబ్బందిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కేకే కుటుంబ సభ్యులు ముంబై నుంచి కోల్‌కతాకు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం కేకే భౌతిక కాయాన్ని ముంబైకు తరలించనున్నారు. అయితే, విమానాశ్రయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గన్ సెల్యూట్ చేయనుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు.
Shahid Kapoor: సూపర్ హీరోలకు చెక్ పెట్టే ‘ది బాయ్స్’!