NTV Telugu Site icon

Viral Video: బస్సులో స్థలం దొరక్కపోవడంతో ఓ యువకుడు ఎలాంటి సాహసం చేశాడో చూడండి.. వీడియో వైరల్

Viral Video

Viral Video

మాములుగా అయితే మనం బస్సుల్లో సీటు దొరకడం కోసమని కట్చీఫ్ వేసి మరీ సీటు దొరకపట్టుకుంటాం. దొరకని వాళ్లు నిలబడి ప్రయాణం చేస్తారు. కానీ.. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం అలా ఉండదు. బస్సులో నిలబడటానికి కూడా స్థలం ఉండదు. ఎందుకంటే అంత రష్ ఉంటుంది. సినిమాల్లో కనిపించే విధంగా రోడ్లన్నీ ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. దాంతో పాటు బస్సుల్లో ఎప్పుడు ప్రయాణికులు నిండి ఉంటారు. అయితే అక్కడి పరిస్థితి తెలిసి కొందరు.. సీటు దొరకడం కోసమని తోపులాటలు, ఘర్షణలు పడి మరీ సీటు సంపాదించుకుంటారు. అయితే.. ఓ వ్యక్తి బస్సులోపల సీటు దొరకనట్టుంది.. అందుకే బస్సు వెనుకాల నిలబడి ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..

Mahua Moitra: డిసెంబర్ 4న లోక్‌సభ ముందుకు మహువా మోయిత్రా రిపోర్ట్..

దేశంలో ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుందో.. అదే విధంగా ముంబైలో జనాభా కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఆ ప్రభావం ముంబైలోనే కాకుండా లోకల్ బస్సులు, బస్సులపైనా కనిపిస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి కాలంలో అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ వీడియోలో ఓ యువకుడు కదులుతున్న బస్సులో విన్యాసాలు చేస్తూ కనిపిస్తాడు.

Qatar: జర్మనీ అధ్యక్షుడికి అవమానం.. అరగంట వరకు విమానం డోర్ వద్దే పడిగాపులు

నివేదిక ప్రకారం.. ఇది ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందినది. రద్దీగా ఉండే రవాణాను నివారించడానికి బెస్ట్ బస్సు వెనుక నుండి ఒక యువకుడు సంతోషంగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. బస్సు వెనుక నెంబర్ ప్లేట్ దగ్గర నిలబడి వెనుక కిటికీ పట్టుకుని ప్రయాణిస్తున్న ఓ యువకుడి స్టంట్ చూసి సోషల్ మీడియాలో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కాస్త పొరపాటు జరిగి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. ఇది చూసిన జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.