అదనపు ఆదాయం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. చిన్న చితకా ఉద్యోగాలు చేసే వారికి అయితే అదనపు ఆదాయం చాలా అవసరం ఉంటుంది. తద్వారా ఆర్ధికంగా బలపడదామని భావిస్తారు. కానీ కొంత మంది మాత్రం అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సరిగ్గా ఇదే రీతిలో ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డులు ఏకంగా గంజాయి వ్యాపారం షురూ చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. బీహార్‌కు చెందిన అర్జున్ కుమార్ అనే వ్యక్తి ఎడన్ బాగ్‌లో నివాసం ఉంటున్నాడు. అమృత…
నోయిడాలోని జేపీ ఆస్పత్రిలో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. మగ, మహిళా సెక్యూరిటీ గార్డులపై ఇష్టానురీతిగా దాడులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకరిని అరెస్ట్ చేయగా.. ఇంకొకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
Medchal : మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మధ్య వివాదం తలెత్తింది. ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మధ్య గొడవ హత్యకు దారి తీసింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో రామకృష్ణ అనే లెక్చరర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని 108 వాహనం ద్వారా బంధువులు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అయితే బాధితుడు రామకృష్ణకు సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు చికిత్స చేశారు. బాధితుడి తలకు కట్టు కట్టి సెలైన్లు పెట్టారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం ఇంజక్షన్ చేసి ఊరుకున్నాడు. దీంతో రామకృష్ణ పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన బంధువులు వెంటనే…
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కొందరు సెక్యూరిటీ గార్డుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శ్రీశైలం దేవస్దానంలో కొంతమంది సెక్యూరిటీ గార్డులు తమ విధులు కాకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. శ్రీశైలం, సుండిపెంటకు చెందిన విద్యార్ధినీల మెయిల్ ఐడీలు హ్యాకింగ్ చేశారు. వారి ఫేస్ బుక్ లో అమ్మాయిల ఫోటోలు సేకరించి వారిని వేధిస్తున్నారు. అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతూ డబ్బు ఆశ చూపిస్తూ విద్యార్థినీలకు వల వేస్తున్న ఆడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పర్సనల్ ఫోటోలను చూపించి అమ్మాయిలను వేధించడం…