Site icon NTV Telugu

Viral Reel: హాస్పిటల్‌లో బెడ్‌పై భర్త.. రీల్ బిజీలో భార్య…

Viral Reel

Viral Reel

ప్రస్తుతం రీల్స్ కు ఎంత క్రేజ్ ఉందంటే.. వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. లైక్ లు, వ్యూస్ కోసం ఆరాటపడుతున్నారు. పక్కనొళ్లు ఏమైనా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్న పర్వాలేదు.. వీళ్లు మాత్రం రీల్ చేస్తుంటారు. అలాంటి ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. భర్త హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు. భార్య మాత్రం రీల్ చేస్తోంది.

READ MORE: CM Chandrababu: నేను ఎప్పుడైనా నేరం, హత్యా రాజకీయాలు చేశానా..? సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి చేరుకున్నాడు. అతడు ఆసుపత్రిలో బెడ్‌పై పడుకుని ఉన్నాడు. వైద్యులు టెస్టు్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ.. పక్కనే ఉన్న భార్య మాత్రం ఈ సన్నీవేశాన్ని తన ఫోన్‌లో బంధించింది. ఫోన్ తీసి బెడ్‌పై పడుకుని ఉన్న భర్తను చూపిస్తూ.. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ భార్యాభర్తల వయసు ఆరుపదులు ఉండొచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన భర్త ఆసుపత్రిలో ఉన్నప్పటికీ.. అస్సలు బాధపడటం లేదు. రీల్ చేయడంతో నిమగ్నమై పోయింది. ఈ వయసులో ఆ వృద్ధ మహిళకు ఇదేం పోయే కాలం అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం తెగ వైరల్ అవుతోంది. ప్రజలు ఈ మహిళను తెగ ట్రోల్ చేస్తున్నారు.

READ MORE: Balmuri Venkat : కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సవాల్‌.. చర్చకు సిద్ధమా..?

Exit mobile version